Connect with us

Entertainment

రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్.. గేమ్ ఛేంజర్ మూవీలో అదే హైలెట్ అంట..

డైరెక్టర్ శంకర్ దాదాపు 3 ఏళ్లుగా గేమ్ ఛేంజర్ సినిమాను తీస్తున్నారు. ఓవైపు ఈ సినిమా తీస్తూనే మధ్యలో కమల్ హాసన్‌తో ఇండియన్ 2 సినిమా కూడా చేసేశారు. అయితే అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ పైన పడింది. అందుకే అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ ఈ సినిమా విషయంలో కాస్త టెన్షన్ పడుతున్నారు. అంతే కాదు గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటివరకూ వచ్చిన పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దానికి తోడు రిలీజ్ డేట్ విషయంలో కూడా నాన్చి నాన్చి క్రిస్మస్ నంచి సంక్రాంతికి ఫిక్స్ చేశారు. పైగా తమకి భయపడే గేమ్ ఛేంజర్ సంక్రాంతికి పోయిందంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. వీటన్నింటికీ ఒకే ఒక్క పోస్టర్‌తో సమాధానమిచ్చారు డైరెక్టర్ శంకర్. తాజాగా టీజర్ రిలీజ్ డేట్ చెప్తూ గేమ్ ఛేంజర్ నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేసారు.

అయితే ఈ పోస్టర్‍లో రామ్ చరణ్ సింపుల్‌గా ఒక బనియన్, ఒక లుంగీ వేసుకొని పట్టాల మధ్యలో కూర్చొని కూల్‌ లుక్ లో ఉన్నారు. చరణ్ ముందు రౌడీలు పట్టాలపై పడుకొని ఉన్నారు. ఈ పోస్టర్‍‌‌ని రిలీజ్ చేసి టీజర్ నవంబర్ 9 రాబోతుందంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ మాకున్న అనుమానాలను ఒకే ఒక్క పోస్టర్‍తో శంకర్ పటాపంచలు చేశారంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఈ పోస్టర్‍ను షేర్ చేస్తూ ఓ ట్వీట్ వేశారు. ఇక ఈ ట్రైన్ ఫైట్ హై యే హై అంటూ థమన్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. సినిమాలో సరైన బ్లాక్‍లో ఈ ట్రైన్ ఫైట్ జరుగతుందంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అదీ కాకుండా త్వరలో రిలీజ్ కానున్న టీజర్‌‍లో కూడా ఈ ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ చూపించే అవకాశం ఉందంటూ ఆశిస్తున్నారు. ఒకవేళ ఈ సీన్ ఉంటే మాత్రం అదే హైలెట్ అవుతుందంటున్నారు అభిమానులు.

ఏది ఏమైనా శంకర్ మార్క్ టేకింగ్‍కి చరణ్ మాస్ తోడైతే సినిమా బంపర్ హిట్ అవ్వడం ఖాయమని చెపొచ్చు. అందుకే విశ్వంభర సినిమాను ఒప్పించి.. సంక్రాంతి బరి నుంచి తప్పించారు నిర్మాత దిల్ రాజు. అయితే అదే సంక్రాంతికి బాలయ్య నటిస్తున్న NBK 109 కూడా రిలీజ్ అవబోతుంది. మరి బాలకృష్ణ కి గేమ్ ఛేంజర్ ఎలాంటి పోటీ ఈబోతుందో చూడాలి మరి.. అంటూ నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.

Advertisement

Loading

Trending