Connect with us

Entertainment

గేమ్ చేంజర్ నుంచి టీజర్ అప్డేట్.. లక్నోలో గ్రాండ్ గా ఈవెంట్..

రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ మూవీ టీజర్ కోసం అభిమానులు ఎన్నోరోజుల నుంచి ఎదురుచూస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటి వరకు పోస్టర్లు, రెండు పాటలతో గేమ్ చేంజర్ టీం అభిమానుల్ని సంతృప్తి పరిచే ప్రయత్నం చేసింది. ఇక సంక్రాంతి జనవరి 10న రాబోతోన్న గేమ్ చేంజర్ మీద ఇంకా హైప్ పెంచాలంటే ఆ మూవీ కి సంబంధించి టీజర్ వదలాల్సిందే. ఈ గేమ్ చేంజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాంటి టీజర్ అప్డేట్‌ను మేకర్లు ఇచ్చారు.

నవంబర్ 9న గేమ్ చేంజర్ టీజర్ రాబోతోంది. లక్నోలో గ్రాండ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు మేకర్లు. ఈ ఈవెంట్‌లోనే గేమ్ చేంజర్ టీజర్‌ను రిలీజ్ చేయబోతోన్నారంటూ అధికారికంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. గేమ్ చేంజర్ పోస్టర్లు అయితే రామ్ చరణ్ అభిమానుల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉన్నాయి. మొన్న వదిలిన లుంగీ లుక్ అదిరిపోయింది. ఇక ఇందులోనే మాస్ యాంగిల్‌ను శంకర్ చూపించేశాడు.

గేమ్ చేంజర్ సంక్రాంతి సీజన్‌లో ముందుగా దిగుతోంది. ఈ మూవీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. టీజర్, ట్రైలర్‌లతో ఎలాగూ హైప్ పెంచేస్తారు. టికెట్లు రేట్లు పెంచుకుంటారు. అదనపు షోలు వస్తాయి. అయితే గేమ్ చేంజర్ కి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం పక్కా అని చెపొచ్చు. ఒక వైపు సంక్రాంతి సీజన్, మరో వైపు పెంచిన రేట్లు.. రామ్ చరణ్ క్రేజ్ ఇలా అన్నీ కలిపితే ఓ స్థాయిలో రికార్డు ఓపెనింగ్స్ వస్తాయి. అయితే దేవర పెట్టిన రికార్డుల్ని పుష్ప 2 లేపేస్తుందా.. లేదా.. అన్నది చూడాలి మరి.

దేవర, పుష్ప 2 పెట్టిన రికార్డుల్ని మాత్రం గేమ్ చేంజర్ చెరిపేయాల్సి ఉంటుంది. గేమ్ చేంజర్ సినిమా కి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా చాలు కలెక్షన్ల మోత మోగిపోతుంది. ఎందుకంటే సంక్రాంతి బరిలో ఓ మాదిరి మూవీ వచ్చినా కూడా పండుగ ఊపులో హిట్ అవుతుంది. అలాంటి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది.

Advertisement

Loading

Trending