Connect with us

Entertainment

గేమ్ చేంజర్ ఓటీటీ ఒప్పందం.. అసలు విషయం ఏమిటి?

రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబోలో రూపొందుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా గత ఏడాది కాలంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. 2024 సంక్రాంతికి రావాల్సిన గేమ్‌ ఛేంజర్‌ ఏకంగా ఏడాది ఆలస్యంగా 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మొన్న వరకు క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయబోతున్నామనే Producer దిల్ రాజు చెప్పారు. కానీ ఇటీవల సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని అధికారికంగా చెప్పారు. విశ్వంభర తప్పుకోవడంతో సంక్రాంతికి గేమ్ ఛేంజర్‌ను విడుదల చేయబోతున్నారు.చిత్ర యూనిట్ సభ్యులు మరియు ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. చరణ్ కెరీర్‌లో ఈ సినిమా ద్వారా మంచి కలెక్షన్స్ వస్తాయని నమ్ముతున్నారు.

శంకర్ గత సినిమాల ఫలితాల నేపథ్యంలో గేమ్ ఛేంజర్‌పై కొంత నెగిటివిటీ ఉంది. ముఖ్యంగా ఇండియన్ 2 సినిమా ఫలితం గేమ్ ఛేంజర్ వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఇండియన్ 2 వచ్చి చాలా రోజులు అవుతుంది. ప్రేక్షకులు దాని నుంచి బయటకు వచ్చేశారు. పైగా ఇది దిల్‌ రాజు బ్యానర్‌లో రూపొందుతున్న సినిమా అవ్వడం వల్ల కథ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.మెగా ఫ్యాన్స్ దిల్ రాజు పై ఉన్న నమ్మకం వల్ల సినిమా హిట్ ఖాయం అని అంటున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా మూడు నెలలు సమయం ఉంది. ఇప్పుడు ఓటీటీ డీల్ గురించి చర్చలు జరుగుతున్నాయి.

థియేట్రికల్ రైట్స్ ను కొంచెం ఆలస్యంగా అమ్మినా, ముందుగానే ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ను అమ్ముతున్నాయి.గేమ్‌ ఛేంజర్‌ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయిందనే వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్‌ వీడియో వారు గేమ్‌ ఛేంజర్ సినిమా తెలుగు వర్షన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ హక్కులను కొనుకోలు చేసిందని కొందరు.. నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని ఇంకొందరు.. రూ. 100 కోట్లు అని మరి కొందరు.. రూ. 150 కోట్లు అని, రూ. 50 కోట్లు అని ఇలా నోటికొచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారు.కానీ వీటిల్లో ఏది నిజమో ఇంకా ఎవరికీ తెలియదు. ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ అందరూ కలిసి గేమ్ చేంజర్ ఓటీటీ డీల్‌ను బాగా ట్రెండ్ చేస్తున్నారు.

రామ్‌ చరణ్‌ తో పాటు ఈ సినిమాలో ఎస్‌ జే సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు, పైగా తమిళ స్టార్ దర్శకుడు శంకర్‌ ఈ సినిమాను రూపొందిస్తున్న నేపథ్యంలో కోలీవుడ్‌ లో గేమ్‌ ఛేంజర్ కి భారీ బజ్ క్రియేట్‌ అయింది. సినిమాను తమిళంలో విడుదల చేయడానికి నిర్మాతలు భారీ మొత్తాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఉత్తరంలో కూడా సినిమాను పెద్ద సంఖ్యలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దిల్ రాజు ఈ సినిమాను రూ.500 కోట్ల బడ్జెట్‌తో తయారుచేస్తున్నారని సమాచారం.

కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, నాజర్‌, జయరాం, శ్రీకాంత్‌, సునీల్ లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. రామ్‌ చరణ్‌ ను ఈ సినిమాలో డ్యుయెల్‌ రోల్‌లో చూడబోతున్నాం. తండ్రి కొడుకు పాత్రల్లో చరణ్ మొదటి సారి కనిపించబోతున్నారు.ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా ఉండబోతుందని ఇప్పటికే యూనిట్ సభ్యులు చెప్పుతున్నారు. సినిమా ప్రమోషన్‌ను వచ్చే నెల నుంచి పూర్తిగా ప్రారంభించి, విడుదల సమయానికి అంచనాలు పెద్దగా పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Loading

Trending