Entertainment
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. ఆయన కూతురు కన్నుమూత

సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో నిన్న గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ గాయత్రి తుది శ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్‌కు కుమారుడు, ఓ కూతురు. గాయత్రి ఆకస్మిక మృతితో షాక్‌లో ఉంది రాజేంద్రప్రసాద్ కుటుంబం. హైదరాబాద్ కూకట్‌పల్లిలో గాయత్రి భౌతికకాయానికి కుటుంబసభ్యులు నివాళి అర్పిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శిస్తున్నారు.
కూతురి మరణంతో కన్నీటి పర్యంతమవుతున్నారు కుటుంబ సభ్యులు. ఈ విషాద వార్త తెలియగానే రాజేంద్రప్రసాద్ గారి ఇంటికి MLA మాధవరం కృష్ణారావు చేరుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించారు. అలాగే సీని సెలబ్రెటీలు ఒకొక్కరుగా రాజేంద్రప్రసాద్ నివాసానికి చేరుకుంటున్నారు.
ఈ వయసులో రాజేంద్ర ప్రసాద్ గారిని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. కూతురి మరణంతో నటకిరీటి కన్నీరు మున్నీరు అవుతున్నారు. రేపు గాయత్రి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు అంటే గాయత్రి కూతురు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మహానటి సినిమాలో సావిత్రి చిన్ననాటి పాత్రను పోషించింది గాయత్రి కూతురు. రాజేంద్ర ప్రసాద్ సంప్రదాయంలో పిల్లల పుట్టిన రోజులను చేస్తారు, వైకుంఠ ఏకాదశి కి కొడుకు పుడితే బాలాజీ అని, విజయదశమి రోజు అమ్మాయి పుట్టింది కనుక గాయత్రి అని నామకరణం చేశారు. మరి కొద్ది రోజుల్లోనే 39 వ పుట్టిన రోజు జరుపుకోవాల్సిన సమయం లో ఈ దుర్ఘటన జరిగింది. ఇంత చిన్న వయసులోనే గాయత్రి గుండెపోటుతో మరణించడంతో రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
అయితే తాజాగా రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి మరణం తరువాత ఒక పాత వీడియో వైరల్ అయింది. బేవార్స్ సినిమా ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు, కూతురంటే తనకు ఎంత ప్రేమో చెప్పిన ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి. బేవార్స్ సినిమాలో కూతురి మీదున్న ప్రేమను తెలిపే ఓ పాట ఉంటుందని, ఆ పాట తనకు రియల్ లైఫ్‌లో కనెక్ట్ అయిందని తన కూతురి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు.
ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కూతురితో తాను మాట్లాడటం లేదని, అయినా ఈ పాట విన్న తరువాత ఆమెను పిలిపించి.. నా మనసులోని మాట ఈ పాటను ప్లే చేసి చూపించాను అంటూ కూతురి మీదున్న ప్రేమను ఆ పాట రూపంలో రాజేంద్ర ప్రసాద్ వినిపించాడట. చిన్నతనంలోనే తన తల్లి చనిపోతే.. కూతురిలోనే తల్లిని చూసుకున్నాడట రాజేంద్ర ప్రసాద్. ప్రస్తుతం కూతురి మరణంతో కుమిలిపోయి, కుప్పకూలిన రాజేంద్ర ప్రసాద్‌ను చూస్తే అందరూ ఎమోషనల్ అయ్యేలా ఉన్నారు. ఇక సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను ఓదార్చేందుకు తరలి వస్తున్నారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు