Entertainment
ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ‘రాజా సాబ్’ నుంచి అఫిషియల్ అనౌన్స్‌మెంట్…

ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాజాసాబ్’ సినిమా షూటింగ్ వచ్చే నెల లేదా డిసెంబర్‌లో పూర్తి చేస్తామంటూ ఇటీవల మేకర్స్ ప్రకటించారు. సినిమాను సమ్మర్‌లో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఇక అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాజాసాబ్ నుంచి టీజర్ వస్తుందనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఎట్టకేలకు మారుతి కాంపౌండ్ కి చెందిన నిర్మాత SKN మీడియా ముందు మాట్లాడుతూ రాజాసాబ్ నుంచి ప్రభాస్ బర్త్ డే కానుక గురించి కొంత క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే విషయాలను ఆయన పంచుకున్నారు.
తాజాగా SKN మీడియాతో మాట్లాడుతూ… రాజాసాబ్ నుంచి ప్రభాస్ బర్త్ డే కానుకగా అక్టోబర్ 23న తీసుకు వచ్చేందుకు దర్శకుడు మారుతి, నిర్మాతలు వర్క్ చేస్తున్నారు. ఏం తీసుకురాబోతున్నారు, ప్రభాస్ ఫ్యాన్స్ కోసం వారు ఇచ్చేది ఏంటి అనేది మూడు నాలుగు రోజుల్లో క్లారిటీ వస్తుందని హామీ ఇచ్చారు. ప్రభాస్ బర్త్‌డే కి రాజాసాబ్ సినిమా అప్డేట్ మాత్రమే కాకుండా కల్కి, సలార్ 2 సినిమాల అప్‌డేట్స్ వస్తాయనే వార్తలు వస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఫౌజీ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.
ఇతర సినిమాల విషయం కొంచెం పక్కన పెడితే రాజా సాబ్ నుంచి సాలిడ్ అప్‌డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తుంది. అతి త్వరలోనే సినిమా షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. కనుక బర్త్ డే నుంచి మొదలుకుని వరుసగా ఏదో ఒక అప్‌డేట్ లేదా వీడియోలతో రాజాసాబ్ సినిమాను ప్రమోషన్ చేయడం జరుగుతుందని నిర్మాత SKN చెప్పారు. మారుతి దర్శకత్వంలో సినిమా అనగానే చాలా మంది మీడియం రేంజ్ బడ్జెట్ మూవీ అనుకుంటున్నారు. కానీ సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రాజాసాబ్ సినిమాకు రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తి అయ్యేప్పటికి ఖచ్చితంగా ఇంతకంటే మరింతగా పెరిగినా ఆశ్చర్యం లేదు.
రాజాసాబ్ సినిమా షూటింగ్ ప్రారంభించి చాలా కాలం అయింది. మొన్నటి వరకు సలార్, కల్కి సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అప్పుడప్పుడు మాత్రమే డేట్లు ఇస్తూ వచ్చిన ప్రభాస్, ఇప్పుడు పూర్తిగా రాజా సాబ్ సినిమా కే టైం మొత్తం కేటాయించారట. అందుకే అతి త్వరలోనే దర్శకుడు మారుతి ఈ సినిమాను ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ ను విభిన్నమైన పాత్రలో అది కూడా కామెడీ యాంగిల్ ఉన్న పాత్రలో చూడబోతున్నాం. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో పాటు కామెడీ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా ఉంటుంది అంటూ రాజా సాబ్ మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు ముగ్గురు ముద్దుగుమ్మలు మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లు నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం వల్ల ఇది పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు భారీగా పెరిగాయి.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు