Connect with us

Entertainment

కెన్యా అడవుల్లో కొనసాగుతున్న లొకేషన్ల వేట.. గ్లోబ్ ట్రాట్టింగ్ కోసం రాజమౌళి..

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నాడు. మహేష్ బాబు మూవీ కోసం లొకేషన్లను దొరకపడుతున్నాడు. కెన్యాలోని నేషనల్ పార్కులో రాజమౌళి, కార్తికేయలు చక్కర్లు కొడుతున్నారు. అక్కడి అటవీ ప్రాంతాన్ని, జంతువులు ఎక్కువగా ఉండే ప్రదేశాలను సర్చ్ చేస్తున్నారు. చూస్తుంటే స్క్రిప్ట్ వర్క్ అంతా రెడీ అయినట్టుగా కనిపిస్తోంది. అందుకే ఇలా బయటకు వచ్చి లొకేషన్లను వెతికే పనిలో పడ్డాడు రాజమౌళి.

 

ఇక కార్తికేయ కూడా హింట్లు ఇస్తున్నాడు. టక్కరి దొంగలోని పాటలను పెడుతూ లొకేషన్ల వేటలో ఉన్నామని హింట్ ఇస్తున్నాడు. విజయేంద్ర ప్రసాద్ గారు అయితే ఈ మూవీ బ్యాక్ డ్రాప్ గురించి ఎప్పుడో చెప్పేశారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని, వరల్డ్ వైడ్‌గా కథ చెప్తామని అన్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్‌గా చిత్రం రానుందని అర్థం అవుతోంది. ఈ మేరకు రాజమౌళి గ్లోబ్ ట్రోట్టింగ్ అనే పదాన్ని కూడా బాగా వాడుకలోకి తీసుకొచ్చాడు.

ఆల్రెడీ మహేష్ బాబు అయితే లుక్‌ను పూర్తిగా మార్చాడు. లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్నాడు. ఇంత వరకు గుబురు గడ్డంతో మహేష్ బాబు కనిపించింది లేదు. అందుకే రాజమౌళి ప్రాజెక్ట్ కాబట్టి.. ఆయనకు నచ్చిన లుక్కులోకి మారాల్సి ఉంటుంది. అందుకే మహేష్ బాబు కూడా తన కెరీర్‌లో మొదటి సారిగా ఇలా కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు రంగు చెడని, క్రాఫ్ చెదరని, దుమ్ము పడని పాత్రల్లో మహేష్ బాబు మనకు కనిపించాడు.

కానీ రాజమౌళి సినిమాలో మాత్రం మహేష్ బాబుతో అన్ని రకాల ఫీట్లు చేయించేలా ఉన్నారు. ఫ్యాన్స్‌కు మాత్రం ట్రీట్ ఇచ్చేలా మహేష్ బాబు ప్రజెన్స్ ఉంటుందనిపిస్తోంది. ఈ మూవీతో బాబు ఏకంగా పాన్ వరల్డ్ హీరో అయిపోయేలా ఉన్నాడు. వరల్డ్ వైడ్‌గా రాజమౌళి మేకింగ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌తో SSMB29 ఆల్రెడీ హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ మూవీకి అన్ని దేశాల్లోనూ ఈజీగా బిజినెస్ అవుతుంది. ఇన్ సైడ్ లెక్కల ప్రకారం చుస్తే ఈ సినిమాకి రాజమౌళి వెయ్యి కోట్లు దాక ఖర్చు పెట్టేలా ఉన్నాడట.

Advertisement

Loading

Trending