Entertainment
SSMB29 గురించి రాజమౌళి.. ఇంకా హైప్ పెంచేసిన జక్కన్న

SS రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు ప్రాజెక్ట్ మీద ఫుల్ ఫోకస్‌తో ఉన్నాడు. కథను రెడీ చేయడంలో బిజీగా ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. విజయేంద్ర ప్రసాద్ ఆల్రెడీ ssmb29 కథను పూర్తి చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఈ ఏడాది చివర్లోనే ఈ మూవీని ప్రారంభించే అవకాశాలున్నాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ ఉంటుందని ఇది వరకే లీక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్లోబరెట్టాన్ అంటూ ఓ పదాన్ని కూడా జక్కన్న వైరల్ చేశాడు.
ఫారెస్ట్ మెన్, జంగిల్ బుక్ టైపులో పూర్తిగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లోనే ఈ సినిమా ఉంటుందనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే మహేష్ బాబు తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. ఇప్పటికే లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. మహేష్ బాబు తన లుక్‌ను మార్చుకునేందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ లుక్ కోసమే సినిమా ఆలస్యం అవుతుందని అందరికీ అర్థమైపోతోంది. అయితే రాజమౌళి అనుకున్న లుక్‌లోకి రావడానికి ఇంకా చాల టైం పడుతుందని అంటున్నారు.
మహేష్ బాబుని ఇది వరకు ఎవ్వరూ చూపించని విధంగా, ఎన్నడూ కనిపించని విధంగా SSMB29లో చూపించబోతోన్నాడు మన రాజమౌళి. అసలే ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతోన్నారు. హాలీవుడ్‌కు ధీటుగా ఈ చిత్రం ఉండేలా రాజమౌళి చూసుకుంటున్నారు. అందుకే ఎంత లేట్ అయినా పర్లేదు కానీ.. ఎక్కడా కాంప్రమైజ్ కావొద్దని ఫిక్స్ అయ్యాడనిపిస్తోంది. RRR సినిమా వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంకా తన నెక్ట్స్ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు.
ssmb29 మూవీ కోసం ఇంటర్నేషనల్ ఆర్టిస్టుల్ని తీసుకోవాలని అనుకుంటున్నాడు జక్కన్న. బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటుల్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారని సమాచారం. RRRలో కంటే ఎక్కువ జంతువుల్ని ఈ SSMB29లో వాడుతానని జక్కన్న చెప్పడంతో ఇక విజువల్ ట్రీట్, ఫీస్ట్ గ్యారెంటీ అని ఆడియెన్స్ ఫిక్స్ అయిపోయారు. అలానే చిన్న పిల్లలను టార్గెట్ చేసేలా జక్కన్న ఎలాగూ ప్లాన్ చేస్తాడని తెలిసిందే.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు