Entertainment
ప్రభాస్ ‘రాజాసాబ్’ కి హ్యారీపోటర్‌తో పోలిక..

ప్రభాస్ “సలార్,” “కల్కి 2898 ఎ.డి” తర్వాత మరొక భారీ పాన్-ఇండియా ప్రాజెక్టు పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈసారి ప్రభాస్ అభిమానులు ఈ సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్‌కి చేరాలని కోరుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు, ఇది ఇప్పటికే రెండేళ్ల కిందట ప్రారంభమైంది. కానీ “కల్కి” విడుదల తర్వాతే ఈ సినిమా పూర్తి స్థాయిలో షూటింగ్‌ను కొనసాగించింది.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అంటేనే అభిమానులకు మొదట ఆశ్చర్యం కలిగించింది. మొదట్లో మారుతి కొన్ని బూతు సినిమాలతో కెరీర్ ప్రారంభించినప్పటికీ, తర్వాత ఫ్యామిలీ మరియు హర్రర్ సినిమాలతో మంచి పేరు సంపాదించాడు. కానీ ప్రభాస్ లాంటి పెద్ద హీరోతో మారుతి ఎలా సినిమా తీస్తాడు అని అభిమానులు మొదట్లో విమర్శించారు, ఇంతేకాకుండా బాయ్‌కాట్ మారుతి అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది, అభిమానులు సినిమాపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవల నిర్మాత విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ, “రాజాసాబ్” చిన్న సినిమా కాదని, ఇది భారీ హారర్ కామెడీ చిత్రం అని చెప్పారు. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద హారర్ మూవీగా రాబోతోందని కూడా చెప్పడంతో ఆసక్తి మరింత పెరిగింది. పైగా బాలీవుడ్ నిర్మాత భూషన్ కుమార్ కొన్ని సన్నివేశాలు చూసి, “రాజాసాబ్” హాలీవుడ్ మూవీ హ్యారీ పోటర్‌ను గుర్తుకు తెస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ హాలీవుడ్ పోలికపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకుముందు “దేవర” గురించి నందమూరి కళ్యాణ్ రామ్ “గేమ్ ఆఫ్ థ్రోన్స్” స్థాయిలో ఉంటుందని అన్నారు, కానీ విడుదల తర్వాత ప్రేక్షకులు నిరాశ చెందారు. ఇప్పుడు “రాజాసాబ్” కూడా హాలీవుడ్ స్థాయి కామెంట్లతో వస్తుండటంతో, ఫలితం ఎలా ఉంటుందో చూడాలి అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు