Connect with us

Entertainment

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో హనుమాన్ తరువాత మహాకాళి..

ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ సినిమా తరువాత పాన్ ఇండియా స్థాయిలో ఆయన ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ప్రశాంత్ వర్మ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు లైన్లో పెట్టాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇప్పటికే చాల సూపర్ హీరోల కథలన్ని రెడీగా ఉన్నాయి. హనుమాన్ టైంలోనే ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం కూడా ఉంటుందని చెప్పాడు. దానికి తగ్గట్టే దసరా సందర్భంగా దుర్గా దేవీ మీద ఓ సూపర్ నేచురల్ పవర్ ఫుల్ సినిమాని తీయబోతోన్నట్టుగా కనిపిస్తోంది.

మహాకాళి అని టైటిల్‌ను కూడా ప్రకటించాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మూడో చిత్రంగా ఈ ప్రాజెక్ట్ రానుంది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ వర్మ మోక్షుతో, అలానే జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అందుకే ఈ మహాకాళి మూవీకి కథ, కథనాన్ని అందించాడు. పూజా కొల్లూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఆర్కేడీ స్టూడియోస్ నిర్మిస్తోంది. అయితే ఈ టైటిల్ రివీల్ సమయంలో రిలీజ్ అయినా పోస్టర్ మాత్రం RRR సినిమాను గుర్తుకు వచ్చేలా ఉంది.

పులితో ఎన్టీఆర్ ఉన్న పోస్టర్‌లానే మహాకాళి పోస్టర్ కూడా ఉంది. పులిని రిఫరెన్సుగా పెట్టాడంటే.. దుర్గా దేవీ కథను బేస్ చేసుకుని సినిమాను తీశాడనిపిస్తోంది. దసరా సందర్భంగా వదిలిన ఈ అప్డేట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. హనుమాన్ యూనివర్స్‌లో భాగంగా ఈ చిత్రం వస్తుందని అన్నాడు. అతి భయంకరమైన, శక్తివంతమైన సూపర్ హీరో.. ఆమె నిశ్శబ్దం, ప్రళయం.. గర్జన, సృష్టి కర్త, వినాశక కర్త.. మహాకాళి అని ప్రకటించారు.

అంటే హనుమాన్ యూనివర్స్‌లో ఈ పాత్రే చాల పవర్ ఫుల్ అని అర్ధమవుతుంది. శక్తికి ప్రధాన మూలమైన దుర్గా దేవి పాత్రతోనే ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీపిక పదుకొణె, అనుష్క, నయనతార ఇలా చాలా మంది పేర్లు లిస్టులో వినిపిస్తున్నాయి. హీరోయిన్‌గా ఎవర్ని ఎంచుకుంటారో చూడాలి. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లోకి వస్తుందో లేదో అనుమానమే.

 

Loading

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending