Telangana
పైకేమో స్పా సెంటర్.. కానీ లోపల మాత్రం మ్యాటర్ వేరు..!

హైదరాబాద్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. స్పా మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం జోరుగా సాగుతోంది. వ్యభిచార ముఠాలపై పోలీసులు నిఘా ఉంచి వరుస దాడులు నిర్వహిస్తున్నా.. కొత్త కొత్త దారుల్లో పాడు పనికి పాల్పడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ చందానగర్‌లో ఇటువంటి ఘటనే వెలుగు చూసింది. స్పా సెంటర్ ముసుగులో కొందరు గలీజు పనులు చేస్తున్నారు. అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ.. అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక పక్కా సమాచారంతో స్పా సెంటర్‌పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు రైడ్ చేశారు. నలుగురు అమ్మాయిలు, ఓ విటుడితో పాటుగా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ డ్రీమ్ అనే పేరుతో స్పా మసాజ్ సెంటర్ ని నిర్వహిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా అందులో అసాంఘిక కార్యకలపాలు సాగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పక్కా నిఘా ఉంచిన హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు.. మంగళవారం రాత్రి స్పా సెంటర్‌పై దాడి చేశారు. దాంతో స్పా సెంటర్లో ఉన్న నలుగురు యువతులని, ఒక విటుడిని పట్టుకున్నారు. స్పా సెంటర్ నిర్వహిస్తున్న నిర్వాహకులను కూడా అరెస్టు చేశారు. పట్టుబడ్డ వారి వద్ద నుంచి నగదు, ఆరు మొబైల్ ఫోన్స్, కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు ఈ కేసును.. చందానగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు విచారణ చేపట్టారు. పట్టుబడిన యువతులు ఎవరు ? వారిని ఎక్కడ్నుంచి తీసుకొచ్చారు ? ఎప్పటి నుంచి స్పా సెంటర్లో పని చేస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇవే కాకుండా ఇంకెక్కడైనా స్పా సెంటర్ బ్రాంచిలు ఓపెన్ చేశారా? అనే విషయంపై విచారణ చేస్తున్నారు. కాగా, నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిఘా ఉంచి అరెస్టు చేయటంతో పాటుగా కఠిన శిక్షలు పడేలా చేస్తామని నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు