Latest Updates
హృదయపూర్వక శుభాకాంక్షలు మిత్రమా.. ట్రంప్‌కి మోదీ విషెస్..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రపంచ దేశాధినేతలు శుభాకాంక్షలు చెప్తున్నారు. అలానే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు.. ఎక్స్ లో శుభాకాంక్షలు చెప్పారు. ఎన్నికల్లో అపూర్వమైన విజయాన్ని అందుకున్న నా ప్రియమైన మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు అంటూ మోదీ ట్వీట్ చేశారు. మీ మునుపటి పదవీకాల విజయాలకు తగ్గట్టుగా.. భారత్-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసిపనిచేద్దామని మోదీ స్వాగతించారు.
‘చరిత్రాత్మక ఎన్నికల విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. మీ పదవీకాలంలో విజయాలకు కొనసాగింపుగా భారత్ – అమెరికా సమగ్ర, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి.. సహకారాన్ని పునరుద్ధరించడానికి నేను ఎదురు చూస్తున్నాను. మన ప్రజల అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం.. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించేందుకు కలిసి కృషి చేద్దాం’ అని మోదీ పిలుపునిచ్చారు. అలానే ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే. గతంలో మోదీ, ట్రంప్‌లు కలిసి అమెరికాలో హౌడీ మోదీ, అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోదీ తనకు మంచి మిత్రుడని ట్రంప్ ఎఫ్పుడూ చెప్తుంటారు. ఎన్నికల సమయంలో భారతీయ అమెరికన్ ఓటర్లతో నిర్వహించిన సమావేశాల్లోనూ మోదీ గురించి ప్రస్తావించి, వారి మెప్పు పొందే ప్రయత్నం చేశారు.
అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుకు అవసరమైన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను డొనాల్డ్ ట్రంప్ సాధించారు. గతంలో డెమొక్రాట్లకు మద్దతుగా ఉన్న రాష్ట్రాల్లోనూ ట్రంప్ మెజార్టీ సాధించారు. ఇక, అత్యంత కీలకంగా భావించిన జార్జియా, నెవాడా, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, మిషిగాన్, ఆరిజోనాల్లోనూ ట్రంప్ దూసుకెళ్లారు. గత జులైలో హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియాలో ఇప్పుడు ట్రంప్ భారీ మెజారిటీ ని దక్కించుకున్నారు. పోయినసారి స్వింగ్ స్టేట్స్‌లో డెమొక్రాటిక్ అభ్యర్ధి 6-1 మెజార్టీతో గెలుపొందడం విశేషం. ఇక, అయోవాలో ట్రంప్ ఓడిపోతారన్న పోల్స్ అంచనాలకు భిన్నంగా అక్కడ ఫలితాలు వచ్చాయి. గతంలో 2016, 2020లో విజయం సాధించిన ట్రంప్.. ఈసారి కూడా విజయం సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు.
ఇక, తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. పెన్సిల్వేనియాలో జరిగిన హత్యాయత్నం ఘటనను ప్రస్తావించారు. ‘ఆ దేవుడు ఓ కారణం కోసమే నా ప్రాణాలు నిలిపాడు’ అని ట్రంప్ అన్నారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ల పోరాటం అనిర్వచనీయమైందని, గొప్పగా పోరాడారని కితాబిచ్చారు. ఇది విజయాన్ని అందించిన అమెరికన్లకు ధన్యవాదాలు చెప్పారు. ఇక ‘ప్రతి అమెరికన్ కోసం, వారి కుటుంబాల కోసం నా చివరి శ్వాస వరకూ పోరాడుతాను’ అని హామీ ఇచ్చారు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు