Entertainment
ఈ సంక్రాంతికి నాగ చైతన్య తండేల్ సినిమాతో వస్తాడా..?

సంక్రాంతి రేసు రసవత్తరంగా సాగేలా ఉంది. ఇక బాలయ్య బాబీ ప్రాజెక్ట్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ కర్చీప్ వేసిపెట్టాయి. గేమ్ చేంజర్ కోసం విశ్వంభర సైడ్ అయిపోయింది. ఇక ఇప్పుడు నాగ చైతన్య నటిస్తున్న తండేల్ కూడా సంక్రాంతి బరిలోకి దిగుతుందని టాక్ వినిపిస్తుంది. నాగార్జున ప్రతీ ఏడాది సంక్రాంతికి ఓ మూవీని దించే ప్రయత్నం చేస్తుంటాడు. మరో వైపు సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకీ మామ రెడీగా ఉన్నాడు. కానీ దిల్ రాజు నుంచి గేమ్ చేంజర్ బరిలోకి వచ్చేసింది కాబట్టి వెంకీమామ మూవీని సైడ్ చేస్తాడేమో.
చందూ మొండేటి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ దక్కించుకున్నాడు. ఇప్పుడు నాగ చైతన్య, సాయి పల్లవితో తండేల్ మూవీని తీస్తున్నాడు. మామూలుగా అయితే ఈ చిత్రం ఆగస్టులోనే రావాల్సింది. ఆ తరువాత డిసెంబర్ అన్నారు. కానీ ఇప్పటివరకు తండేల్ గురించి ప్రస్థావనే కనిపించడం లేదు. తాజాగా తండేల్‌ను సంక్రాంతికి రెడీ చేస్తున్నారనే గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ కాసాగింది. అసలే సంక్రాంతికి తీవ్రపోటి ఉందన్న సంగతి తెలిసిందే.
అక్కినేని ఫ్యామిలీకి సంక్రాంతి బాగానే కలిసి వస్తుంది. నాగార్జున ప్రతీ సంక్రాంతికి వచ్చి హిట్టు కొట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో చాలా సార్లు సక్సెస్ అయ్యాడు. అయితే ఈ సారి నాగ చైతన్య బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. ఇప్పటికే వెంకీ మామ, బాలయ్య, రామ్ చరణ్ చిత్రాలు సంక్రాంతికి కర్చీప్ వేశాయి. ఒక ప్రొడ్యూసర్ నుంచి రెండు చిత్రాలు సంక్రాంతికి వస్తున్నాయంటే మిగతా వాళ్లు ఏదో ఒక కాంట్రవర్సీ అయితే చేసేలా ఉన్నారు.
రామ్ చరణ్ గేమ్ చేంజర్ జనవరి 10న రాబోతోంది. రామ్ చరణ్ కోసం విశ్వంభరను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు దిల్ రాజు గేమ్ చేంజర్ సంక్రాంతి బరిలో ఉంది. అంతే వెంకీమామ అనిల్ రావిపూడి మూవీని సంక్రాంతి బరి నుంచి తప్పిస్తాడా? లేక కంటిన్యూ చేస్తాడా? అన్నది చూడాలి. ఇక నాగవంశీ అయితే మాకు అసలు ఈ సంక్రాంతికి పోటీ అన్నదే లేదంటూ బాబీ, బాలయ్య మూవీ మీద ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.
ఇలాంటి టైట్ ఫైట్‌లో తండేల్‌ను దించుతారా? గీతా ఆర్ట్స్ రిస్క్ చేస్తుందా? అన్నది చూడాలి. సాయి పల్లవి, నాగ చైతన్యల హిట్ పెయిర్.. కార్తికేయ 2తో చందూ మొండేటి మంచి ఫాంలోకి రావడం, పాన్ ఇండియా కథతో తండేల్‌ను రూపొందిస్తుండటం అందరికీ తెలిసిందే. మరి తండేల్ రిలీజ్ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. సాయి పల్లవి అమరన్ మూవీ దీపావళికి వస్తోన్న సంగతి తెలిసిందే.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు