Connect with us

Entertainment

నాగ చైతన్య-శోభిత పెళ్లి.. అయితే వేదిక ఇదేనా?

నాగ చైతన్య, శోభిత పెళ్లి వేడుకల గురించి నిత్యం ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఈ జంట నిశ్చితార్థం తరువాత బయట ఎక్కువగా కనిపించడం లేదు. మొన్నామధ్య ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో మెరిసింది. ఇక శోభిత ఇంట్లో అయితే పసుపు దంచి పెళ్లి పనుల్ని ప్రారంభించారు. అంటే పెళ్లికి సంబంధించిన షాపింగ్, ఇతరరత్రా ఏర్పాట్లను కానిచ్చేస్తున్నారు. అయితే ఇంత వరకు వీరిద్దరి పెళ్లి తేదీని అధికారికంగా అయితే చెప్పలేదు. డిసెంబర్ నెలలోనే పెళ్లి ఉంటుందని అప్పట్లో అన్నారు.

తాజాగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన డేట్, వేదిక బయటకు వచ్చింది. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి ఉంటుందని అంటున్నారు. అక్కడ మండపాన్ని సెట్ చేస్తున్నారట. ఈ మేరకు వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి ఉంటుందని, అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరుగుతుందని అంటున్నారు. ఆగస్టులో వీరికి ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

ఇక సమంతతో నాగ చైతన్య విడిపోయిన తరువాత శోభిత గురించి ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. వీళిద్దరూ కలిసి లండన్ వీధుల్లో తిరుగుతున్నారని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే వీరిద్దరి మీద వచ్చిన వార్తలను, డేటింగ్ టాక్‌ను అంతా నమ్మారు. కానీ చైతూ మాత్రం ఇదంతా రూమర్ అన్నట్టుగా కొట్టి పారేశాడు. ఎందుకు వేరే అమ్మాయిని మధ్యలోకి లాగి ట్రోలింగ్ చేస్తున్నారు అంటూ అన్నాడు.

కానీ చివరకు చైతూ, శోభిత ఒక్కటి కాబోతోన్నారు. మరి వీర ప్రేమ ఎప్పుడు చిగురించింది? ఎప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు.. డేటింగ్ ఎన్నేళ్లు చేశారు? వీరి ప్రేమ వల్లే సమంత దూరం కావాల్సి వచ్చిందా? సమంత దూరం అయ్యాకే వీరి ప్రేమ చిగురించిందా? అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు. ఇక పోతే నాగ చైతన్య గానీ శోభిత గానీ తమ ప్రేమ విషయం గురించి ఎక్కడా ఎవ్వరికీ చెప్పలేదు. వచ్చే ఏడాది తండేల్ అంటూ నాగ చైతన్య హిట్టు కొట్టేందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే.

Advertisement

Loading

Trending