Connect with us

Andhra Pradesh

Mumbai Actress Case: ఓ వెబ్‌సిరీస్‌కి సరిపడా డ్రామా..

Mumbai Actress Case: ఓ వెబ్‌సిరీస్‌కి సరిపడా డ్రామా.. అనేక ట్విస్ట్‌లు.. ఊహించని మలుపులు

Mumbai Actress Caseఓ వెబ్‌సిరీస్‌కి సరిపడా డ్రామా ఇది. ఈ కేసులో అనేక ట్విస్ట్‌లు.. ఊహించని మలుపులు. అప్పట్లో పోలీసు రికార్డుల్లో ఆమె నిందితురాలు. ఇప్పుడామె తప్పుడు కేసుల్లో వేధింపులకు గురైన బాధితురాలు. అయితే కీలక నిందితుడి అరెస్ట్‌తో మరో టర్న్‌ తీసుకోబోతోంది ముంబై సినీనటి జత్వానీ కేసు. ఈ థ్రిల్లింగ్‌ ఎపిసోడ్‌లో నెక్ట్స్‌ సీన్ ఎలా ఉండబోతోంది‌?

ముంబై నటి కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడప్‌ అయింది. కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్​ అరెస్ట్‌తో ఈ కేసు ఉత్కంఠ రేపుతోంది. విద్యాసాగర్‌ను డెహ్రాడూన్​లో అదుపులోకి తీసుకున్న పోలీసులు… సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నారు.

మరోవైపు ముంబయి నటి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి కాంతిరాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై సోమవారం న్యాయస్థానం విచారణ జరపనుంది. ముంబయి నటి కేసులో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని కాంతిరాణా ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. కుక్కల విద్యాసాగర్‌ విచారణతో జత్వానీ కేసు ఏ వైపు మలుపు తిరుగుతుందో, ఎందరి పేర్లు బయటికి వస్తాయోనని ఆసక్తి నెలకొంది.

 

Loading

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending