Connect with us

Tech

Mobile Data: మీ మొబైల్‌ డేటా త్వరగా అయిపోతుందా?

Mobile Data: మీ మొబైల్‌ డేటా త్వరగా అయిపోతుందా? ఈ పొరపాట్లు కావచ్చు.. సెట్టింగ్స్‌ మార్చుకోండి!

రోజు ముగిసేలోపు మొబైల్ డేటా అయిపోతుందని మీరు ఆందోళన చెందుతుంటే, మీరు ఇక చింతించాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మనం అంతగా ఉపయోగించలేదని తరచుగా ఫిర్యాదు చేస్తుంటారు. మరి ఇంత త్వరగా మొబైల్ డేటా ఎలా అయిపోతుంది? నిజానికి మనం చేసే కొన్ని తప్పులు త్వరగా..

రోజు ముగిసేలోపు మొబైల్ డేటా అయిపోతుందని మీరు ఆందోళన చెందుతుంటే, మీరు ఇక చింతించాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మనం అంతగా ఉపయోగించలేదని తరచుగా ఫిర్యాదు చేస్తుంటారు. మరి ఇంత త్వరగా మొబైల్ డేటా ఎలా అయిపోతుంది? నిజానికి మనం చేసే కొన్ని తప్పులు త్వరగా డేటా నష్టానికి దారితీస్తాయి. మీరు ఐదు సెట్టింగ్స్‌లను మారిస్తే మీ మొబైల్ డేటా త్వరగా అయిపోయే సమస్య తొలగిపోతుంది. ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుందాం?

బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను మూసివేయండి: కొన్నిసార్లు యాప్‌లు ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతాయి. దాని గురించి మనకు కూడా తెలియదు. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న ఈ మొబైల్ యాప్‌లు డేటాను వినియోగిస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు, డేటాను సేవ్ చేయడానికి, ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి అప్లికేషన్‌లపై క్లిక్ చేసి, ఆపై మీకు అంతగా ఉపయోగపడని యాప్‌పై క్లిక్ చేయండి. యాప్‌పై క్లిక్ చేసిన తర్వాత, యాప్ సెట్టింగ్‌లను జాగ్రత్తగా తనిఖీ చేయండి. డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉండే బ్యాక్‌గ్రౌండ్ డేటా ఎంపికను మీరు కనుగొంటారు. ఈ ఎంపికను ఆఫ్ చేయండి. ఇది మీ మొబైల్ డేటా వినియోగాన్ని తగ్గిస్తుంది.

ఆటో-అప్‌డేట్‌ని ఆఫ్ చేయండి: ఫోన్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌కి వెళ్లి యాప్ సెట్టింగ్‌లకు వెళ్లి యాప్‌లు మొబైల్ డేటా ద్వారా అప్‌డేట్ అవుతున్నాయో లేదో చెక్ చేయండి. అలా అయితే ఈ ఎంపికను వైఫైకి సెట్ చేయండి. తద్వారా Wi-Fiకి కనెక్ట్ చేయబడినప్పుడు మాత్రమే యాప్‌ల అప్‌డేట్‌ గురించి తెలుస్తోంది.

Loading

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending