Connect with us

International

MIT గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌లో పాలస్తీనాకు మద్దతు: భారత సంతతి విద్యార్థినిపై బ్యాన్

MIT Grad Megha Vemuri Slams Israel, MIT Ties in Viral Pro-Palestine Speech

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో జరిగిన గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌లో భారత సంతతికి చెందిన విద్యార్థిని మేఘా వేమూరి పాలస్తీనాకు తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె, పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు అమెరికా మరియు MIT సంస్థలు సాయం చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో MIT యాజమాన్యం మేఘా వేమూరిపై నిషేధం విధించింది.

MIT సంస్థ భావప్రకటనా స్వేచ్ఛను అంగీకరిస్తున్నప్పటికీ, గ్రాడ్యుయేషన్ వంటి వేదికలపై నిరసనలను ప్రోత్సహించబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం మేఘా వేమూరి MIT క్లాస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంఘటన సంస్థలో స్వేచ్ఛాయుత భావప్రకటన మరియు నిరసనల స్వరూపంపై తీవ్ర చర్చకు దారితీసింది.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending