Entertainment
Chiru fire on konda surekha సినిమా వాళ్లను టార్గెట్ చేస్తూ రాజకీయాలోకి లాగడం సిగ్గుచేటు

సినిమా వాళ్లను టార్గెట్ చేస్తూ రాజకీయాలోకి లాగడం సిగ్గుచేటు
Chiru fire on konda surekha మంత్రి కొండా సురేఖపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగచైతన్య – సమంత విడాకుల విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి వ్యాఖ్యలను ఇప్పటికే పలువురు ఖండించగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, అల్లు అర్జున్, మంచు విష్ణు సహా మరికొందరు స్పందించారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో సమంత, అక్కినేని నాగచైతన్య విడాకుల విషయమై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా, సినీ పరిశ్రమకు చెందిన పలువురు తీవ్రంగాకండిస్తునారు . ఇప్పటికే నాగార్జున, సమంత, నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్, నాని సహా చాలా మంది మంత్రి వ్యాఖ్యలను ఖండించగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, అల్లు అర్జున్, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
“గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. సెలబ్రిటీలపై వ్యాఖ్యలు చేసి తక్కువ సమయంలో వార్తల్లో నిలిచేందుకు, సినీ కుటుంబాలకు చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటు. మా సినీ కుటుంబసభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటల దాడులను చిత్ర పరిశ్రమ మొత్తం ఏకతాటిపై వ్యతిరేకిస్తాం. ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు, ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు. అసహ్యకరమైన కల్పిత ఆరోపణలు చేయడం రాజకీయంగా మంచిది కాదు. సమాజ అభివృద్ధి కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం. కానీ ఇలాంటి వ్యాఖ్యలతో వారు తమ స్థాయిలను దిగజార్చుకోవద్దు. గౌరవ ప్రదమైన స్థానాల్లో ఉండేవారు, రాజకీయ నాయకులు ఎంతో మందికి స్ఫూర్తిగా ఉండాలి” అని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
“వ్యక్తిగత విషయాలను రాజకీయంగా వాడుకోవడం చాలా బాధ కలిగించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చడం దురదృష్టకరం. మా సినిమా కుటుంబం మొత్తం పరస్పరం సహకరించుకుంటాం. సినిమా వాళ్ల వ్యక్తిగత జీవితాలను రాజకీయ రంగంలోకి లాగడం ఎవరికీ ఉపయోగం ఉండదు. ఉన్నతపదవుల్లో ఉన్నవాళ్లు, రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.” – హీరో వెంకటేశ్
“రాజకీయ నాయకులు సినీ ప్రముఖుల వారి కుటుంబాలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి కి విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను అంగీకరించకూడదు. ఇతరుల వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా మహిళలను గౌరవించేలా పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నాను. ” – అల్లు అర్జున్, సినీనటుడు
“సమాజంలో ఇటీవల కాలంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనల కారణంగా సినిమా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరం. సినీ పరిశ్రమ ఇతర రంగాల మాదిరిగానే గౌరవం, నమ్మకంతో నడుస్తోంది. ప్రజా లేదా రాజకీయ లాభాల కోసం అవాస్తవ కథనాలను వాడటం చాలా నిరాశ కలిగించింది. మేం నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం. కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే మాకు కూడా గౌరవం, రక్షణ అవసరం.” – మంచు విష్ణు, మా అధ్యక్షుడు
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు