Entertainment
మహేష్ బాబు సినిమాకు బడ్జెట్ సమస్యా? శ్రీను వైట్ల ఏమన్నారు?

ఒకప్పుడు కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన శ్రీను వైట్ల, ఆయన సినిమాలు నవ్వులు పూయించడం గ్యారెంటీ అనిపించేవి. కానీ, మహేష్ బాబుతో చేసిన ఆగడు తర్వాత ఆయన చిత్రాలు వరుసగా ఫలించకపోవడం మొదలైంది. ఆగడు, అందరివాడు, బ్రూస్ లీ, అమర్ అక్బర్ ఆంటోని లాంటి చిత్రాలు బోల్తా కొట్టడంతో శ్రీను వైట్ల కాస్త వెనుకబడ్డారు.
ఇప్పుడు గోపీచంద్తో చేసిన విశ్వం చిత్రం ఈ ఇద్దరికీ ఎంతో కీలకంగా మారింది, ఎందుకంటే ఇద్దరూ ఇటీవల సక్సెస్‌లకు దూరంగా ఉన్నారు. ప్రమోషన్ల సమయంలో శ్రీను వైట్ల తన గత చిత్రాల గురించి కూడా మాట్లాడారు. అందరివాడు కథ తనది కాదని, కేవలం దర్శకత్వం మాత్రమే చేసినట్టు తెలిపారు. బ్రూస్ లీ చిత్రం నిర్మాతలకు పెట్టుబడికన్నా ఎక్కువగా రాబట్టిందని చెప్పారు. అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో కొత్త ప్రయోగం చేసినట్టు చెబుతూ, అది ముందే కష్టమవుతుందన్న ఆలోచన తనకు ఉన్నట్టు అన్నారు.
ఇక ఆగడు కోసం ముందు వేరే కథ అనుకున్నాడట శ్రీను వైట్ల. ఆ టైంలో సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై మూవీని చూశాడట. ఆ టైపులో ఓ పాయింట్ అనుకుని మహేష్ బాబుకి చెప్పాడట. మహేష్‌కి కూడా చాలా నచ్చిందట. కానీ అది చాలా పెద్ద స్పాన్ అవుతోందని, ఖర్చు ఎక్కువ అయ్యేలా ఉందని, బడ్జెట్ వల్ల ఆ కథను పక్కన పెట్టేసి ఆగడు కథను అనుకున్నారట.
మహేష్ బాబు సినిమాకు బడ్జెట్ సమస్యలు వస్తాయా? మహేష్ వస్తే.. ఎంతైనా పెట్టేందుకు నిర్మాతలు ముందుకు వస్తారు కదా.. ఆగడు కంటే.. ఆ పాయింట్ మీదే శ్రీను వైట్ల సినిమా తీసినా రిజల్ట్ వేరేలా ఉండేదేమో అని నెట్టింట్లో చర్చలు నడుస్తున్నాయి. విశ్వం మూవీకి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ మూవీ శ్రీను వైట్ల పూర్తిగా కమ్ బ్యాక్ ఇచ్చినట్టు అయితే కాదని అంటున్నారు.

-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు