Connect with us

Entertainment

మహేష్‌ బాబు – రాజమౌళి సినిమా… రెండు పార్ట్‌లు నిజమేనా..

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, SS రాజమౌళి కాంబో మూవీ గురించి ‘బాహుబలి’ సమయం నుంచి టాక్ వినిపిస్తుంది. వీరిద్దరి కాంబోలో సినిమాను నిర్మించేందుకు నిర్మాత కేఎల్‌ నారాయణ పుష్కర కాలం క్రితం అడ్వాన్స్‌ ఇచ్చి ఉన్నారు. బాహుబలి తర్వాత మహేష్ బాబుతో సినిమాను తీయాలని రాజమౌళి అనుకున్నా కొన్ని కారణాల వల్ల రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లతో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను తీయాల్సి వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్‌ సమయంలోనే తన తదుపరి సినిమా ఖచ్చితంగా మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించిన రాజమౌళి అన్నట్లుగానే ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ చివరి దశలో ఉందనే వార్తలు వస్తున్నాయి.

రాజమౌళి సినిమా అనగానే దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో ఆసక్తి ఉంటుంది. బాహుబలి రెండు పార్ట్‌లతో పాటు RRR సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో మనకి తెలుసు. అందుకే మహేష్ బాబుతో సినిమాను రాజమౌళి అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. రాజమౌళి సైతం అదే విధంగా సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు. ఇక KL నారాయణ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. మహేష్ బాబు 2025లో మొత్తం డేట్లు రాజమౌళికి ఇవ్వనున్నారు. ఇప్పటికే ఏడాది కాలంగా రాజమౌళి సినిమా కోసం వెయిట్‌ చేస్తున్న మహేష్ బాబు వచ్చే ఏడాది సైతం రాజమౌళి సినిమా తప్ప మరే సినిమాను చేసేందుకు ఓకే చెప్పే అవకాశాలు లేవు.

ఈ మధ్య కాలంలో చూస్తే టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ సినిమాలు, స్టార్‌ హీరోల సినిమాలు ఎక్కువగా రెండు పార్ట్‌లుగా ఉన్నాయి. పుష్ప, దేవర, సలార్‌, కల్కి ఇలా ఎన్నో సినిమాలు సెకండ్‌ పార్ట్‌ తో మనముందుకు వస్తున్నాయి. కనుక మహేష్ బాబుతో రాజమౌళి రూపొందించబోతున్న సినిమా సైతం రెండు పార్ట్‌లుగా ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందబోతున్న ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా విడుదల చేస్తే నిర్మాతతో పాటు అందరికీ డబుల్‌ లాభం దక్కుతుంది. అయితే రాజమౌళి మాత్రం కథ పెద్దగా ఉండి, సింగిల్ పార్ట్‌లో తీయలేము అని భావిస్తేనే సెకండ్‌ పార్ట్‌ కి వెళ్తారు అనే విషయం అందరికి తెలుసు.

బాహుబలి వంటి పాత్రలు, పెద్ద కథ ఉన్న సినిమాలను మాత్రమే సెకండ్ పార్ట్‌గా తీయాలని అనుకుంటున్నారు. RRR సినిమా ఇద్దరు స్టార్‌ హీరోలు ఉన్నారు, కథ కూడా రెండు పార్ట్‌లుగా చేసే అవకాశం ఉంటుంది. అయినా రెండు పార్ట్‌లను ప్రేక్షకుల మీద రుద్ద వద్దు అనే ఉద్దేశ్యంతో జక్కన్న ఆ సినిమాను సింగిల్‌ పార్ట్‌గానే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. కాబట్టి మహేష్ బాబు సినిమాను రాజమౌళి సింగిల్ పార్ట్‌గానే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

Advertisement

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending