Latest Updates
ఇరాన్ నుంచి వచ్చే ముప్పు కారణంగా, అమెరికా ఇజ్రాయెల్కు ఆధునిక రక్షణ వ్యవస్థ ‘థాడ్’ అందించింది.

ఇరాన్ నుంచి వచ్చే ముప్పు కారణంగా, అమెరికా ఇజ్రాయెల్కు ఆధునిక రక్షణ వ్యవస్థ ‘థాడ్’ అందించింది.
హెజ్బొల్లా భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించి ఇజ్రాయేల్ స్థావరాన్ని ధ్వంసం చేసింది. ఈ ఘటనలో నలుగురు సైనికులు మరణించగా, డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. రాకెట్లతో పాటు డ్రోన్లను ప్రయోగించడంతోనే ఇజ్రాయేల్ వాటిని అడ్డుకోలేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. అత్యంత కట్టుదిట్టమైన గగనతల వ్యవస్థలను ఇది తప్పించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ క్రమంలో అమెరికా తమ థాడ్ క్షిపణి వ్యవస్థను ఇజ్రాయేల్ రక్షణ కోసం పంపాలని నిర్ణయించినట్టు పెంటగాన్ తెలిపింది.
హెజ్బొల్లా, ఇరాన్ క్షిపణి దాడులపై రగిలిపోతున్న ఇజ్రాయేల్ ప్రతీకారానికి సిద్ధమవుతోందనే వార్తల నడుమ పశ్చిమాసియాలో క్రమంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయేల్ రక్షణ కోసం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను మోహరించనున్నట్లు పెంటగాన్ ప్రకటించింది. దాన్ని ఆపరేట్ చేసేందుకుగాను తమ బలగాలను పంపుతున్నట్లు తెలిపింది. తమపై దాడులు చేస్తోన్న ఇజ్రాయేల్కు దూరంగా ఉండాలని అమెరికాను ఇరాన్ హెచ్చరించిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.
‘టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ బ్యాటరీ (THAAD)’ని, సైనిక దళాలను ఇజ్రాయేల్కు పంపుతున్నట్లు పెంటగాన్ తెలిపింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు ఈ వ్యవస్థను మోహరించేందుకు రక్షణశాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అనుమతి ఇచ్చారని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయేల్ గగనతల రక్షణను బలోపేతం చేసేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది. ‘థాడ్’ అనేది ఓ గగనతల రక్షణ వ్యవస్థ. శత్రువులు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను ఇది కూల్చేస్తుంది.
ఇరాన్ ఆరోపణల ప్రకారం, ఇజ్రాయేల్కు అమెరికా రికార్డు స్థాయిలో ఆయుధాలను అందజేస్తోందని అన్నారు. ఇప్పుడు క్షిపణి నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేసి, దాన్ని నిర్వహించేందుకు సైన్యాన్ని పంపడం వాళ్ల ప్రాణాలను ప్రమాదంలో పెడుతుందంటూ ఇరాన్ మండిపడింది.పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధాన్ని నివారించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేశామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాసీ అరాఘ్చీ అన్నారు. తమ ప్రజలను, ప్రయోజనాలను కాపాడుకొనే విషయంలో హద్దులన్నీ చెరిపేస్తామని ఆయన హెచ్చరించారు.
అమెరికా గగనతల రక్షణ వ్యవస్థ థాడ్కు బాలిస్టిక్ క్షిపణులను నిరోధించే సామర్ధ్యంతో రూపొందించారు. అత్యాధునిక ఈ క్షిపణి నిరోధక వ్యవస్థను అమెరికా అందజేస్తుండటంతో ఇరాన్ ప్రయోజనాలపై ఇజ్రాయేల్ మరింత దూకుడుగా దాడిచేసే అవకాశం ఉంది. ఇప్పటికే నిపురగప్పిన నిప్పులా మారిన పశ్చిమాసియాలో మరింత అగ్గిరాజేస్తుంది. పూర్తి యుద్ధం జరగకుండా చేసే ప్రయత్నాలకు ఇది అడ్డుపడుతోంది. అమెరికా నిర్ణయం హెజ్బొల్లా తో పాటు ఇరాన్ మిత్రులకు ఒక విధంగా హెచ్చరికలా ఉందని చెబుతున్నారు.
మరోవైపు, ఆదివారం లెబనాన్ సరిహద్దుల్లోని హైఫా సమీపంలో బిన్యామినా ఇజ్రాయేల్ సైనిక శిక్షణ స్థావరంపై హెజ్బొల్లా డ్రోన్ దాడి చేసింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గాజాలోని శరణార్ధి శిబిరంపై ఇజ్రాయేల్ సైన్యం ఆదివారం చేసిన దాడిలో ఒకే కుటుంబం సహా 15 మంది మరణించారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional9 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment9 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics8 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు