Connect with us

Latest Updates

Nala Cat: ఈ పిల్లి సంపద రూ.840 కోట్లు. ఎలా సంపాదించిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!

Nala Cat: ఈ పిల్లి సంపద రూ.840 కోట్లు. ఎలా సంపాదించిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!

Nala Cat: ఈ పిల్లి సంపాదన వందల కోట్లలో ఉంటుంది. అదేంటీ పిల్లి ఏంటి.. సంపాదన ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. అది కూడా వందల కోట్లలో అని నోరెళ్లబెడుతున్నారా. అది నిజమే. ఒక పిల్లి కోట్లలో సంపాదిస్తోంది. పైగా ఆ పిల్లికి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ కూడా ఉంది. ఆ అకౌంట్‌ను 45 లక్షల మంది ఫాలో అవుతున్నారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లిగా ఈ పిల్లి రికార్డుల్లోకి ఎక్కింది. అంతేకాకుండా గిన్నిస్ రికార్డ్‌ కూడా దక్కించుకుంది.

నాలా క్యాట్: ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన పిల్లి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. దాని మొత్తం సంపాదన ఏకంగా రూ.840 కోట్లు. అది మీద, దానికి సోషల్ మీడియాలో మంచి పేరుంటుంది. ఈ పిల్లి పేరు నల. దీనికి ఇన్‌స్టాలో 45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే దీని క్రేజ్‌ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నాలా పిల్లి, ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న పిల్లిగా గిన్నిస్ రికార్డు కూడా సాధించింది.

క్యాట్స్‌.కామ్‌ వెబ్‌సైట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నల పిల్లి నికర సంపద సుమారు 100 బిలియన్‌ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో అక్షరాలా రూ.840 కోట్లు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సియామీ టాబీ మిక్స్‌ క్యాట్‌. 2010లో వరిసిరి మేతచిట్టిఫాన్ అనే మహిళ.. స్థానికంగా ఉన్న జంతు సంరక్షణ కేంద్రం నుంచి ఈ పిల్లిని దత్తత తీసుకుంది. ఆ సమయంలో, దాని వయసు కేవలం 5 నెలలు మాత్రమే. 2012లో, వరిసిరి అనే వ్యక్తి ఆ నాలా పిల్లి ఫోటోలు, వీడియోలను పంచుకునేందుకు ఇన్‌స్టాలో “నల” అనే పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకే దానికి ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగింది.

ఈ క్రమంలో, ఆ నాలా పిల్లికి ఇన్‌స్టాలో 4.5 మిలియన్ల ఫాలోవర్లు చేరారు. దీంతో, అత్యధిక ఫాలోవర్లు ఉన్న జంతువుగా నల గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది. ఈ నల పిల్లి అందమైన తలపాగా మరియు నీలికళ్లతో చూస్తే, చూడేవారికి మంత్రముగ్ధులవుతారు. నల పిల్లికి ఉన్న పెద్ద ఫాలోయింగ్ కారణంగా, పెంపుడు జంతువుల విభాగంలో ఫోర్బ్స్ టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల జాబితాలో కూడా పేరు పొందింది. అంతేకాకుండా ఈ పిల్లి పేరు మీద “లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్ అకార్డింగ్ టు నల క్యాట్’ అనే ఈ-బుక్‌ను కూడా ఉంది.

“లవ్‌ నాలా” అనే పేరుతో ఒక వెబ్‌సైట్‌ను తయారుచేసి, ప్రీమియం పిల్లి ఆహారం బ్రాండ్‌ను నిర్వహిస్తోంది. ఈ “లవ్‌ నాలా” బ్రాండ్ హస్బ్రో, రియల్ వెంచర్స్, సీడ్ క్యాంప్‌ల వంటి కంపెనీల నుండి వందల కోట్లను సంపాదిస్తోంది. మరోవైపు, ఈ నల పిల్లి సంపాదన ఎక్కువగా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్, వివిధ ప్రొడక్ట్స్ యాడ్స్, బ్రాండ్‌ల ద్వారా వస్తోంది. ఈ పిల్లికి ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్ మరియు ఇతర అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లు ఉన్నాయి.

Advertisement

ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జంతు సంరక్షణపై అవగాహన కల్పించడం, స్వచ్ఛంద సంస్థలకు నిధులు సేకరించడం వంటివి ఆ పిల్లిని పెంచుతున్న వరిసిరి చేస్తున్న పనులు. నల తర్వాత ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న పిల్లిగా ఒలివియా బెన్సన్ నిలిచింది. ఈ ఒలివియా బెన్సన్ పిల్లి నికర విలువ రూ. 813 కోట్లు. మూడో అత్యంత సంపన్న పిల్లిగా దివంగత జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ ఒట్టో లాగర్‌ఫెల్డ్‌కు చెందిన చౌపెట్టే నిలవగా.. దాని సంపద రూ.109 కోట్లు ఉంది.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending