Latest Updates
రిపోర్ట్ చూసి షాకైన తండ్రి కుమార్తె అందంగా ఉందని డీఎన్ఏ టెస్ట్

రిపోర్ట్ చూసి షాకైన తండ్రి కుమార్తె అందంగా ఉందని డీఎన్ఏ టెస్ట్
సాఫీగా సాగిపోతున్న ఓ దంపతులు జీవితంలో ఓ పెద్ద సమస్య ఏర్పడింది. అందుకు వారి కుమార్తె అందం కారణమైంది. అవును మీరు చదువుతోంది నిజమే. తన భార్య, తాను అందంగా లేకపోయినా.. పాలరాతి శిల్పం వంటి అందమైన కుమార్తె పుట్టిందేంటి ఆ తండ్రికి అనుమానం వచ్చింది. ఆ అనుమానమే పెను భూతమైంది. తన సందేహానికి చెక్ పెట్టాలని అనుకున్న అతడు, చివరికి డీఎన్ఏ పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నాడు.
ఎటువంటి కలతలు లేకుండా ఆ దంపతుల కాపురం హాయిగా సాగుతోంది. బిడ్డ మరీ అందంగా ఉండటం భర్తలో అనుమానం మొదలైంది. అసలు ఆమె తన రక్తం పంచుకుని పుట్టిన కూతురేనా? అన్న అనుమానంతో వ్యవహారం డీఎన్‌ఏ టెస్టు దాకా వెళ్లింది. DNA టెస్ట్ చేయించి రిపోర్ట్ తండ్రి షాక్ అయ్యాడు . last కు సినిమాను తలపించే ట్విస్టుతో clarity వచ్చింది ఈ ఆసక్తికరమైన సంఘటన వియత్నాంలో జరిగినది
వియత్నాంలోని హనోయ్ నగరానికి చెందిన దంపతులు తమ మూడేళ్ల కుమార్తె లాన్ (Lan)తో కలిసి కొన్నేళ్ల కిందట హో చిన్ మిన్హ్ సిటీకి వెళ్లి స్థిరపడ్డారు. కుమార్తెను అక్కడే ఓ స్కూల్‌లో చేర్పించారు. లాన్ టీనేజ్‌కు వచ్చేసరికి కుందనపు బొమ్మలా మారింది. అదే ఆమె తండ్రిలో అనుమాన బీజాలు నాటింది. భార్యాభర్తలు ఇద్దరూ అందంగా లేకపోయినా కుమార్తె ఎందుకు అందంగా పుట్టిందనే సందేహం ఆయనలో కలిగింది. దీంతో భార్య హాంగ్ (Hong) పై అనుమానంతో కుమార్తెకు డీఎన్‌ఏ పరీక్ష చేయించాలని నిర్ణయించాడు.
ఆసుపత్రికి తీసుకెళ్లి కుమార్తె లాన్‌కు డీఎన్ఏ పరీక్ష చేయించాడు. ఆ రిపోర్టు చూసిన తండ్రి షాక్ అయ్యాడు. లాన్ తన సొంత కుమార్తె కాదని తెలిసింది. అప్పుడు అతను భార్యాబిడ్డలను వదిలి, తాగుడుకు బానిసయ్యాడు. దాంతో కుమార్తెను తీసుకుని హాన్ హనోయ్ సిటీకి తిరిగి వెళ్లింది. అక్కడే కుమార్తెను స్కూల్లో చేర్చింది. ఇక్కడ కథ మరో మలుపు తిరిగింది. లాన్ పుట్టినరోజు సందర్భంగా హంగ్ తన కుమార్తె చదివే స్కూల్‌కు వెళ్లింది. అదే తరగతిలోని మరో అమ్మాయికి కూడా అదే రోజు పుట్టినరోజు కావడంతో ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చారు. హంగ్, ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఒకరికి ఒకరు పరిచయం చేసుకున్నారు. వారి పరిచయం స్నేహంగా మారడంతో, మరుసటి ఏడాది ఇద్దరికీ కలిపి ఉమ్మడిగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సమయంలో లాన్ పుట్టిన ఆసుపత్రిలో ఆ బాలిక కూడా పుట్టిందని హాంగ్ తెలుసుకుంది. దాంతో, తమతో పెరుగుతున్న అమ్మాయి తన అసలు కుమార్తెనేమో అనే సందేహం వచ్చింది.
తన మనసులో ఉన్న విషయాన్ని ఆ అమ్మాయి తల్లిదండ్రులతో పంచుకుంది. ఈ విషయంలో స్పష్టత కోసం, మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయికి డీఎన్ఏ పరీక్ష చేయిద్దామని సూచించింది . వారు ఒప్పుకోవడంతో పాపకు డీఎన్ఏ పరీక్ష చేయించగా, లాన్ నమూనాలతో సరిపోలాయి. దీంతో ఇన్నాళ్లు తన దగ్గర పెరిగిన లాన్ ఆ దంపతుల కుమార్తె అని నిర్ధారణ అయ్యింది. ఇద్దరూ కవలలని, పుట్టిన సమయంలో ఆసుపత్రి సిబ్బంది పొరపాటు వల్ల విడిపోయినట్టు తేలింది. అయితే, నిజం తెలియడంతో లాన్ తమ కుమార్తె అని ఆ దంపతులు తీసుకున్నారా? పిల్లలకు నిజం చెప్పారా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. అలాగే, హాంగ్ భర్త తన తప్పును తెలుసుకుని తిరిగి భార్యతో కలిసిపోయాడా?. లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ, దీనిపై నెటిజన్‌లు మాత్రం రకరకాలు స్పందిస్తున్నారు. ‘ఆసుపత్రి సిబ్బంది ఘోరమైన తప్పిదం చేశారు.. అదృష్టవశాత్తూ నిజం తెలిసింది.. లేకపోతే ఆమె నదిలో దూకినా కూడా నింద తొలగిపోయేది కాదు’ అని ఓ నెటిజన్ అన్నారు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు