Connect with us

Latest Updates

చైనాకు ఊహించని షాక్ ఇచ్చిన బ్రెజిల్.. డ్రాగన్ ఆశలను చూర్నం చేసింది

చైనాకు ఊహించని షాక్ ఇచ్చిన బ్రెజిల్.. డ్రాగన్ ఆశలను చూర్నం చేసింది. భారత్ మార్గంలో బ్రిక్స్ దేశం అడుగులు..! 

బ్రిక్స్లో కీలక సభ్యదేశమైన బ్రెజిల్ చైనాకు షాకిచ్చింది. స్వయంకృషి ప్రయోజనాల్లో దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్, భారత్ మార్గంలో నడిచింది. బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్లో చేరాలని మొదట సానుకూలంగా కనిపించిన బ్రెజిల్, చైనా అధ్యక్షుడు పర్యటన సమయంలో బీఆర్ఐలో చేరుతుందని అందరూ అనుకున్నారు. కానీ, జిన్పింగ్ పర్యటనకు మూడు వారాల ముందే బీఆర్ఐలో చేరమని బ్రెజిల్ చైనాకు స్పష్టంగా చెప్పింది. ఇంతకు ముందు భారత్ కూడా బీఆర్ఐలో చేరేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. 

భారత్, చైనా దేశాలు బ్రిక్స్ కూటమిలో కీలక సభ్య దేశాలనే సంగతి తెలిసిందే. రెండు దేశాలు పొరుగు దేశాలు మరియు ఆసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అయినప్పటికీ, డ్రాగన్ వైఖరి కారణంగా వీరి మధ్య మంచి సంబంధాలు లేవని తెలుసు. నేపథ్యంలో, చైనా గతంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)లో భారత్ భాగం కాలేదు. ఇప్పుడు, భారత్ మార్గంలోనే మరో బ్రిక్స్ దేశం కూడా చేరింది. 

చైనా లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్న బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)లో చేరేందుకు బ్రెజిల్ నిరాకరించింది. అయితే చైనా నుంచి పెట్టుబడులు పొందడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు బ్రెజిల్ మొగ్గు చూపుతోంది. అధికారికంగా బీఆర్ఐలో చేరనప్పటికీ.. మౌలిక వసతుల ప్రాజెక్టులు, బీఆర్ఐతో అనుసంధానమైన పెట్టుబడుల విషయంలో చైనాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రెజిల్ తెలిపింది. అంటే చైనా నుంచి పెట్టుబడులకు దేశం సుముఖంగానే ఉంది కానీ.. పెట్టుబడుల కోసం పూర్తిగా డ్రాగన్పై ఆధారపడొద్దని భావనలో దేశం ఉంది. 

 చైనాతో సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లాలని అనుకుంటున్నామన్న బ్రెజిల్.. బీఆర్ఐ కోసం చైనా ప్రతిపాదించిన కాంట్రాక్ట్పై సంతకాలు చేసేందుకు మాత్రం నిరాకరించింది. ఒప్పందంలో మేం భాగం కావడం లేదంటూ.. చైనా ప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చింది. 

Advertisement

చైనా ఆశలపై నీళ్లు.. 

బ్రిక్స్ సభ్యదేశమైన బ్రెజిల్ బీఆర్ఐలో చేరుతుందని చైనా ఆశించింది. నవంబర్ 20 చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బ్రెజిల్ను సందర్శించనున్నారు. అయితే చైనా అధినేత పర్యటనకు మూడు వారాల ముందే బీఆర్ఐలో చేరబోమంటూ బ్రెజిల్ స్పష్టతనిచ్చింది. బ్రెజిల్ ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రివర్గాలు ఇటీవల బీఆర్ఐలో చేరికకు వ్యతిరేకంగా గళం వినిపించాయి. 

దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్, బీఆర్ఐలో చేరడం వల్ల అమెరికాతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భావిస్తోంది. అదే సమయంలో బీఆర్ఐలో చేరినా.. ఇప్పటికిప్పుడే ఒనగూరే ప్రయోజనం కూడా దేశానికి కనిపించలేదు. దీంతో బీఆర్ఐలో చేరడానికి నిరాకరించింది. 

బలమైన శక్తిగా ఎదుగుతోన్న బ్రెజిల్.. 

బీఆర్ఐలో ఇప్పటికే 150 దేశాలు ఉన్నవి, వాటిలో 22 లాటిన్ అమెరికా దేశాలు కూడా ఉన్నాయి. బ్రెజిల్ చేరడం ద్వారా బీఆర్ఐకి తన బలం మరింత పెరుగుతుందని చైనా అనుకుంది. చిన్న చిన్న దేశాలు చైనా అందించే సాయానికి బీఆర్ఐలో చేరాయి. కానీ బ్రెజిల్ భౌగోళికంగా చాలా పెద్ద దేశం. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పెద్దది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో బ్రెజిల్ 11 స్థానంలో ఉంది. అపారమైన సహజవనరులు దేశం సొంతం. బీఆర్ఐలో చేరిక వల్ల తమ దేశంలో ముడి ఖనిజవనరులను చైనాకు ఎగుమతి చేయాల్సి వస్తుందని.. దీని వల్ల తమకు పెద్దగా ప్రయోజనం ఉండదని బ్రెజిల్ పాలకులు భావించారు. 

Advertisement

బీఆర్ఐతో చైనా గుప్పిట్లోకి ప్రపంచ దేశాలు.. 

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకెళ్తోన్న చైనా.. అందుకు బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ను ఉపయోగించుకుంటోంది. బీఆర్ఐ ద్వారా చాలా దేశాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టుతోంది, దేశాలను అప్పుల లో చిక్కించాలనుకుంటోంది. తర్వాత వాటిని తన చేతుల్లో ఉంచుకునే వ్యూహాన్ని చైనా అనుసరిస్తోంది. మన పొరుగు దేశమైన పాకిస్థాన్ దీనికి పెద్ద ఉదాహరణ. 

 బీఆర్ఐలో భాగమైన చైనా పాక్ ఎకనమిక్ కారిడార్ (సీపెక్) కోసం చైనా 60 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్తున్నందువల్ల, ఇది భారత్ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తుందని భారత్ స్పష్టంగా చెప్పింది. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఇండియా నిరసన వ్యక్తం చేసింది. 

Loading

Trending