Latest Updates
కరెంట్‌షాక్ తో జవాన్ మరణించాడు. హెయిర్ డ్రైయర్ పేలి, భార్య చేతులు తెగిపోయాయి.

కరెంట్‌షాక్ తో జవాన్ మరణించాడు. హెయిర్ డ్రైయర్ పేలి, భార్య చేతులు తెగిపోయాయి.
హెయిర్ డ్రైయర్ పేలడంతో ఓ మహిళ చేతులు తెగిపడిన విషయం ప్రస్తుతం పెద్ద చర్చకు గురైంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె భర్త సైన్యంలో పనిచేస్తున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ కారణంగా మరణించారు. తాజాగా ఆమెను హెయిర్ డ్రైయర్ పేలడం వల్ల చేతులు కోల్పోయింది. అయితే ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
ఆ కుటుంబంలో ఒకటి తర్వాత మరొకటి తీవ్ర విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆర్మీలో పని చేస్తూ ఒక జవాన్ కరెంట్ షాక్ కారణంగా మృతి చెందాడు. ఆ దుఃఖం ఇంకా మిగిలి ఉండగానే మరో ప్రమాదం జరిగింది. హెయిర్ డ్రైయర్ పేలడంతో ఆ జవాన్ భార్య చేతులు తెగిపోయాయి. పెద్ద శబ్దం రావడంతో పొరుగువారు వచ్చి చూడగా ఆ మహిళ గాయపడి ఉందని కనుగొన్నారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని డాక్టర్లు చెప్పారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్ జిల్లాలో జరిగింది, ఇది ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.
బసవరాజేశ్వరి అనే మహిళ ఇంటి పక్కన నివసించే శశికళ అనే మహిళ పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది. డెలివరీ బాయ్ శశికళకు ఫోన్ చేసి చెప్పగా, ఆమె ఊర్లో లేని సమయంలో పార్సిల్‌ని పక్కింట్లో ఉండే బసవరాజేశ్వరికి ఇవ్వాలని సూచించింది. వెంటనే బసవరాజేశ్వరికి ఫోన్ చేసి చెప్పగా, ఆమె ఆ పార్సిల్ తీసుకుంది. ఆ పార్సిల్‌లో ఏముందో చూడాలని శశికళ బసవరాజేశ్వరీకి చెప్పింది. ఆమె ఆ పార్సిల్‌ను ఓపెన్ చేసి చూశా, అందులో ఒక హెయిర్ డ్రైయర్ కనిపించింది. ఆ తర్వాత శశికళ హెయిర్ డ్రైయర్‌ను చెక్ చేయాలని చెప్పగా, బసవరాజేశ్వరి దాన్ని ప్లగ్‌లో పెట్టింది.
దీంతో ఒక్కసారిగా ఆ హెయిర్ డ్రైయర్ పేలిపోయింది. ఆ సమయంలో బసవరాజేశ్వరి చేతుల్లో ఉన్న ఆ హెయిర్ డ్రైయర్ పేలడంతో ఆమె చేతులు తెగిపడ్డాయి. హెయిర్ డ్రైయర్ పేలిపోవడంతో పెద్ద శబ్దం వచ్చి, వెంటనే ఆ ఇంటి దగ్గర ఉన్నవారు రచ్చరచ్చగా వచ్చి చూడగా, బసవరాజేశ్వరి గాయపడినట్లు కన్పించింది. ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. కాగా, బసవరాజేశ్వరి భర్త పాపన్న యర్నాల్, కొన్నేళ్ల క్రితం ఆర్మీలో పనిచేస్తుండగా, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతి చెందాడు. 2017లో జమ్మూ కాశ్మీర్‌లో పాపన్న యర్నాల్ కరెంట్ షాక్‌తో మరణించారు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు