Connect with us

Latest Updates

“రియల్ ఎస్టేట్: విల్లా కొనుగోలు చేస్తే రూ.4 కోట్ల లాంబోర్గినీ కారు ఉచితం..

రియల్ ఎస్టేట్: విల్లా కొనుగోలు చేస్తే రూ.4 కోట్ల లాంబోర్గినీ కారు ఉచితం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి బంపర్ ఆఫర్.” 

రియల్ ఎస్టేట్: విల్లా కొనుగోలు చేస్తే ఖరీదైన కారు ఉచితంగా ఇస్తానని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ చెప్పడం ప్రస్తుతం సంచలనం సృష్టించింది. సాధారణంగా ప్లాట్లు, ఇళ్లు, విల్లాలను విక్రయించేందుకు సదరు రియల్ ఎస్టేట్సంస్థలు అనేక ఆఫర్లు, గిఫ్ట్లు ప్రకటిస్తూ ఉంటాయి. కానీ, రూ.4 కోట్ల లాంబోర్గినీ కారు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం ఇప్పుడు తీవ్రమైన చర్చకు కారణమైంది. రూ.4 కోట్ల కారు ఉచితంగా ఇస్తున్నారంటే.. విల్లా ధర ఎంత ఉంటుందో అనే ఆలోచన వస్తుంది కదూ.. అయితే స్టోరీలో విల్లా ధర ఎంతో తెలుసుకుందాం. 

Real Estate: బిజినెస్ పెట్టినా అందులో మార్కెటింగ్, ప్రమోషన్స్, యాడ్స్ చాలా ముఖ్యం. ఇక రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే.. ప్లాట్లను, ఇళ్లను, విల్లాలను అమ్మేందుకు.. జనాలను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్లాట్లలో వివిధ రకాల చెట్లు ఉంటాయి. ఇళ్లు, విల్లాలు కొనాలంటే గిఫ్ట్లు, ఇంటీరియర్తో పాటు అనేక సదుపాయాలు ఇస్తారు. అయితే ఖర్చులన్నీ ప్లాట్ల, ఇళ్ల, విల్లాల్లో కలుపుతూ, మనకు ఉచితంగా ఇస్తున్నట్లు చూపిస్తారు. ఇలాగే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ తమ విల్లాలను అమ్మేందుకు ఒక మంచి ఐడియా వచ్చింది. వారు తమ విల్లాలు కొనుగోలు చేస్తే, ఒక్కొక్కరికి రూ.4 కోట్ల విలువైన లాంబోర్గినీ ఉరుస్ కారు ఉచితంగా ఇస్తామని చెప్పారు. విషయంలో ట్విటర్లో ఒక పోస్ట్ పెట్టగా, అది చాలా వైరల్ అవుతోంది. ఉత్తర్ప్రదేశ్లోని నోయిడాకు చెందిన ప్రముఖ రియల్ఎస్టేట్సంస్థ జేపీ గ్రీన్స్ బంపరాఫర్ను ప్రకటించింది. తమ వద్ద లగ్జరీ విల్లా కొన్నవారికి లాంబోర్గిని ఉరుస్కారును ఉచితంగా ఇస్తామని సోషల్మీడియాలో పోస్ట్చేశారు. దీంతో పోస్ట్ ప్రస్తుతం చాలా వైరల్గా మారింది. తమకు అమ్మే రూ.26 కోట్ల విలువైన ప్రత్యేక విల్లాలు కొనుగోలు చేసే వారికి లాంబోర్గినీ ఉరుస్ కారు ఉచితంగా ఇస్తామని చెప్పారు. 

అంతేకాకుండా విల్లాల్లో ఉండే వారికి ఇతర విలాసవంతమైన సౌకర్యాలను కూడా కల్పించనున్నట్లు తెలిపింది. పార్కింగ్, స్విమ్మింగ్ పూల్, థియేటర్, క్లబ్ సభ్యత్వం, గోల్ఫ్ కోర్స్ కోసం రూ.26 కోట్లకు అదనంగా మరి రూ.50 లక్షలు చెల్లించాలి అని జేపీ గ్రీన్స్ సంస్థ చెప్పారు. రూ.30 లక్షలు పార్కింగ్కు.. రూ. 7.5 లక్షలు కరెంట్ జనరేటర్కు.. మరో రూ.7.5 లక్షలు క్లబ్ మెంబర్షిప్ కోసం చెల్లించాలని తెలిపింది. 

 అయితే ఆఫర్ కొద్దిరోజుల వరకు మాత్రమే అందుబాటులోకి ఉంటుందని తెలిపింది. తమ వద్ద విల్లాలు రూ.51 లక్షల నుంచి రూ.30 కోట్ల వరకు ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో 3 BHK, 4 BHK, 5 BHK, 6 BHKలు ఉన్నట్లు స్పష్టం చేసింది. విషయం గౌరవ్ గుప్తా అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

Advertisement

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending