Latest Updates
పెళ్లి చేసుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ. లక్ష నుంచి రూ.కోటి వరకు ఇస్తారు

పెళ్లి చేసుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ. లక్ష నుంచి రూ.కోటి వరకు ఇస్తారు
పెళ్లి అంటేనే ఖర్చులు. వధూవరులు చూసుకోవడం దగ్గరి నుంచి పెళ్లి తంతు పూర్తయ్యేవరకు అంతా డబ్బుతో కూడుకున్నదే. అయితే ఇక నుంచి పెళ్లి చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక సంస్థ వినూత్న ఆలోచన చేసింది. పెళ్లిళ్లు చేసుకునేవారికి వివాహ ఖర్చుల కోసం రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పెళ్లి సంబంధాలు చూస్తున్న మాట్రిమొని డాట్ కామ్ ఇప్పుడు.. పెళ్లిళ్లకు లోన్లు కూడా ఇవ్వడం ప్రారంభించింది.
ప్రస్తుతం పెళ్లిళ్లు చాలా ఖరీదు అయ్యాయి. ప్రీ వెడ్డింగ్, సంగీత్, హల్దీ, పెళ్లి, బరాత్, రిసెప్షన్ వంటి వివిధ ఈవెంట్లు నిర్వహిస్తారు. వీటన్నింటి ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. పెళ్లి అంటే, అమ్మాయి కుటుంబం మరియు అబ్బాయి కుటుంబం రెండు కూడా భారీ ఖర్చులు చేస్తుంటాయి. పెళ్లిళ్ల ఖర్చులు తట్టుకునేందుకు చాలా మంది అప్పులు చేస్తుంటారు. పెళ్లి సంబంధాల కోసం పని చేసే సంస్థ అయిన మ్యాట్రిమొనీ.కామ్ ఇప్పుడు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. వారు పెళ్లి చేసుకునే వారికి వధువు, వరుడులను వెతికి పెట్టడమే కాకుండా, పెళ్లి కోసం లోన్లు కూడా ఇస్తున్నారు.
రోజురోజుకూ పెళ్లి ఖర్చులు ఎక్కువవుతున్నా, మ్యాట్రిమొనీ.కామ్ సంస్థ కొత్త సేవలను ప్రారంభించింది. ఇప్పటి వరకు పెళ్లి సంబంధాలే కుదుర్చే ఈ సంస్థ, ఇక నుంచి పెళ్లి ఖర్చుల కోసం రుణాలు కూడా ఇస్తుంది. ఈ కోసం ప్రత్యేకంగా “వెడ్డింగ్‌లోన్స్.కామ్” అనే ఫిన్‌టెక్ వేదికను ప్రారంభించింది. ఐడీఎఫ్‌సీ, టాటా క్యాపిటల్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ వంటి సంస్థలతో “వెడ్డింగ్‌లోన్స్.కామ్” ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థల ద్వారా పెళ్లి చేసుకునే వారికి రుణాలు అందిస్తామని మ్యాట్రిమొనీ.కామ్ సీఈవో మురుగవేల్ జానకీరామ్ శుక్రవారం చెప్పారు.
మ్యాట్రిమొనీ.కామ్ సంస్థ ద్వారా పెళ్లిళ్ల కోసం రూ.1 లక్ష నుండి రూ.1 కోటి వరకు రుణాలు ఇస్తామని మురుగవేల్ జానకీరామన్ చెప్పారు. ఈ రుణాలను తిరిగి చెల్లించడానికి నెలవారీ ఈఎంఐ సౌకర్యం కూడా అందిస్తామని అన్నారు. పెళ్లిళ్ల కోసం తీసుకున్న రుణాలను 30 ఏళ్ల వరకు చెల్లించవచ్చని చెప్పారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనాల ప్రకారం, నవంబర్ 12 నుండి డిసెంబర్ 16 మధ్య 48 లక్షల జంటలు పెళ్లి చేసుకుంటారని చెప్పారు. పెళ్లిళ్ల సీజన్ మొదలయ్యాక ఈ సౌకర్యం అందుబాటులో వస్తుందని చెప్పారు.
ఈ వెడ్డింగ్ లోన్స్‌పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని మంచిదిగా చూస్తున్నారు. మ్యాట్రిమొనీ.కామ్ పెళ్లి సంబంధాలు మాత్రమే కాదు, పెళ్లి చేసుకునేందుకు లోన్లు కూడా ఇస్తోందని వారంతా ఆనందంగా చెప్పారు. మరికొందరు మాత్రం అప్పు చేసి పెళ్లిళ్లు చేసుకోవడం తప్పు అని ప్రశ్నిస్తున్నారు. మన దగ్గర ఉన్న డబ్బు ఆధారంగా పెళ్లి చేసుకుంటే అది భారంగా ఉండదని అంటున్నారు. హంగు, ఆర్భాటాలకు పోయి అప్పులు చేసి పెళ్లి చేసుకుంటే, తర్వాత పరిస్థితి ఎలా అవుతుందో అని వారు అనుకుంటున్నారు.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు