Connect with us

Latest Updates

ఢిల్లీ కాలుష్యానికి పాకిస్థానే కారణమా ?

ఢిల్లీ కాలుష్యానికి పాకిస్థానే కారణమా

శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఢిల్లీ సహా ఉత్తర భారత నగరాల్లో గాలి బాగా కాలుష్యం అవుతూ ఉంటుంది. దీంతో మధ్యాహ్నం కూడా గాలి కాలుష్యం కారణంగా మంచుతో కప్పి  ముందు ఏం ఉందో కనిపించనంతగా ఉంటుంది. ఈ కాలుష్యానికి ప్రధాన కారణం పంట వ్యర్థాలను దహనం చేయడమేనని.. కోర్టులు ,పర్యావరణ వేత్తలు, కూడా పేర్కొన్నాయి. పాకిస్థాన్‌ కారణంగానే ఢిల్లీ సహా ఉత్తర భారత రాష్ట్రాల్లో గాలి కాలుష్యం నెలకొంటుందని తాజాగా ఓ అధికారి పేర్కొనడం సంచలనంగా మారింది.

చలికాలం ప్రారంభంలోనే ఉత్తర భారతదేశాన్ని గాలి కాలుష్యం ముంచేస్తోంది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు నగరాల్లో కూడా గాలి నాణ్యత రోజురోజుకూ తీవ్రంగా పడిపోతోంది. ఈ నేపథ్యంలోనే పరిస్థితి తీవ్రంగా మారింది. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో రైతులు పంటలు పూర్తయిన తర్వాత వాటి వ్యర్థాలను కాల్చేస్తారు. దీంతో పంట వ్యర్థాలను కాల్చగా వచ్చిన రసాయనాలు, పొగతో గాలి పూర్తిగా కాలుష్యం అవుతూ ఉంటుంది. దీనిపై పర్యావరణ వేత్తలు, ప్రభుత్వాలు, కోర్టులు.. చివరికి సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఢిల్లీలో శీతాకాలం వచ్చిందంటే చాలు.. గాలిలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ గాలి నాణ్యత తీవ్ర ప్రమాదరకరమైన స్థితిలోనే ఉంటోంది.ఉత్తర్‌ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారి డీకే గుప్తా ఉత్తర్‌ప్రదేశ్‌లోని 3 నగరాల్లో గాలి కాలుష్యానికి ప్రధాన కారణం పాకిస్తాన్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. పాకిస్తాన్‌లో పంట వ్యర్థాలను రైతులు దహనం చేయడం వల్లే.. నోయిడా, ఘజియాబాద్ ,గ్రేటర్ నోయిడా నగరాల్లో గాలి పూర్తిగా విషపూరితంగా మారిందని అంటున్నారు . గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, నోయిడా,  నగరాల్లో గాలి నాణ్యత సూచి – దారుణంగా పడిపోయింది. గ్రేటర్ నోయిడాలో 312 ఏక్యూఐ.. ఘజియాబాద్‌లో 324 మేర ఏక్యూఐ నోయిడాలో 304 ఏక్యూఐ..  నమోదైంది.

గ్రేటర్ నోయిడాలోని ఉత్తర్‌ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి డీకే గుప్తా.. ఆ రాష్ట్రంలో నమోదవుతున్న గాలి కాలుష్యం గురించి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో, నోయిడా,  ఒకే రోజు గాలి నాణ్యత సూచి దారుణంగా పడిపోవడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ఈ పరిస్థితికి మనం మన పొరుగు దేశం అయిన పాకిస్తాన్‌ను నిందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల ఈ 3 నగరాల్లో గాలి విషపూరితంగా మారిందని తెలిపారు. దేశ సరిహదు ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్‌‌లో పంట వ్యర్థాలను దహనం చేస్తే. భారతదేశం లోని నగరాల్లో గాలి కాలుష్యానికి కారణం అని కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఆరోపించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

 

Loading

Advertisement

Trending