Connect with us

Entertainment

‘పుష్ప 2’ను బహిష్కరిస్తారంటా.. అది సాధ్యపడే విషయమేనా..?

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో సహా.. పాన్‌ ఇండియా వైడ్‌గా మూవీ లవర్స్ ‘పుష్ప 2’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూపులు చూస్తున్నారు. బాలీవుడ్‌ సినిమాలను మించి పుష్ప 2 వరల్డ్‌ వైడ్‌గా భారీస్థాయిలో ప్రీ రిలీజ్ థియేట్రికల్‌ బిజినెస్ చేసింది. నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ రూ.400 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. సినిమాకు కనీస స్థాయిలో టాక్ వచ్చినా మూడు, నాలుగు వందల కోట్లు వచ్చేస్థాయి. ఇక పాజిటివ్ టాక్ మాత్రం వస్తే.. థియేటర్లో ఐదారు వందల కోట్లు కొల్లగొడుతుంది. ఆ లెక్కన అప్పుడు పుష్ప 2 బ్రాండ్ వాల్యూ వెయ్యి కోట్లు దాటేస్తుంది.

పుష్ప 2 ఆ స్థాయి వసూళ్లు రాబట్టి బ్రేక్ ఈవెన్‌ సాధించాలి అంటే ప్రతి ఏరియాలోనూ, అలానే ప్రతి రాష్ట్రంలోను భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టాలి. ఏ రాష్ట్రం నుంచి అయినా వసూళ్లు తగ్గితే ఓవరాల్‌ కలెక్షన్స్ పై తీవ్రంగా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కన్నడ సినీ ప్రేక్షకులు పుష్ప 2 మీద కాస్త గుర్రుగా ఉన్నారు. ఆ మూవీని బాయ్‌కాట్‌ చేయాలంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల వచ్చిన కన్నడ మూవీ ‘బఘీర’ ను తెలుగు నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ట్రోల్‌ చేయడం జరిగిందని.. సినిమాకి థియేటర్లు ఎక్కువ ఇవ్వకుండా వివక్ష చూపించారని కన్నడ నెటిజన్స్‌ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

తమిళంలో వేరే భాషల చిత్రాలకు థియేటర్లు ఇవ్వడం లేదు.. కానీ ఇక్కడ మాత్రం మీకు ఎందుకు థియేటర్లు ఇవ్వాలంటూ కన్నడ ప్రెస్ మీట్‌లో హీరో సూర్యను అడిగారు. అసలే కన్నడ ఇండస్ట్రీలో ఒకప్పుడు డబ్బింగ్ చిత్రాలు బ్యాన్. అది ఇప్పుడు మారింది. అన్ని భాషల చిత్రాలు అక్కడికి వెళ్తున్నాయి.. అక్కడి సినిమాలు అన్ని భాషలకు వెళ్తున్నాయి. కానీ ఇప్పుడు బఘీరను ట్రోల్ చేశారు.. తక్కువ స్క్రీన్లు ఇచ్చారంటూ పిచ్చి వాగుడు వాగేస్తున్నారు.

కొందరు మతిలేని వారు పుష్ప 2ని బ్యాన్ చేయాలని అంటున్నారు. అది అసలు జరిగే పనేనా? అని ఫ్యాన్స్ అంటున్నారు. పుష్ప 2ని ఎవ్వరూ అడ్డుకోలేరని, భారీ స్థాయిలో పుష్ప 2 థియేటర్లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ ఇండియా వైడ్‌గా అన్ని చోట్ల సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టేందుకు గాను దాదాపు రూ.100 కోట్లను ఖర్చు చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. శ్రీలీల ఈ సినిమా ఐటం సాంగ్‌లో కనిపించబోతుందనే గాపిస్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Loading

Trending