Entertainment
దేవర మూవీ ఓటీటీ రిలీజ్.. అప్పుడే వస్తుందా..?

‘RRR’ తర్వాత ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇప్పటికీ రన్ సాధిస్తోంది. అయితే మొదటి రోజు రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్‌ను దక్కించుకున్న దేవర సినిమా అయిదు వారాలు పూర్తి అయ్యేప్పటికి రూ.400 కోట్ల వసూళ్లు చేసింది. ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా దేవర నిలిచిందని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది. నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కి ఏర్పాట్లు చేస్తోందని సమాచారం.
సాధారణంగా ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు థియేటర్‌లో రిలీజ్ అయిన నాలుగు వారాల్లో ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. కానీ దేవర సినిమా మాత్రం అయిదు వారాలు పూర్తి అయిన ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్ కాలేదు. దాదాపు అన్ని ఏరియాల్లోనూ థియేట్రికల్ రన్ పూర్తి అయినట్టుగానే కనిపిస్తోంది.
అయితే ఇప్పుడు దేవర ఓటీటీ రానున్నట్టుగా కనిపిస్తోంది. ఆరు వారాల తర్వాత థియేట్రికల్ రన్ పూర్తి అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే నవంబర్ రెండో వారంలో ఈ మూవీని ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని అంటే నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీని నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని లు నిర్మించారు. ఇక అనిరుధ్ అందించిన మ్యూజిక్ సినిమాకి హైలైట్ అని చెపొచ్చు. అంతే కాదు కొరటాల శివ ఈ మూవీని రెండు పార్ట్‌లుగా తీస్తున్నాడు. రెండో పార్ట్‌కి సంబంధించిన షూటింగ్‌ను వచ్చే ఏడాది ప్రారంభించబోతున్నారు. ఇక దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేసింది. అయితే ఆమె నటన విషయంలో ప్రతిభ చూపించడానికి అంతగా స్కోప్ దక్కలేదు. రెండో పార్టులోనే ఆమెకు ఎక్కువ టైం రన్ ఉంటుందని కొరటాల, ఎన్టీఆర్ చెప్పిన సంగతి మనకి తెలిసిందే.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు