Entertainment
జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ లభించింది… కానీ ఎన్ని రోజులకి?

జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేస్తూ.. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం ఆ బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. అయితే జానీ మాస్టర్ బెయిల్ కోరుతూ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఐదు రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని బెయిల్ పిటిషన్‌లో కోరారు. అయితే ఢిల్లీలో ఉత్తమ డాన్స్ దర్శకుడిగా నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని.. కోర్టును జానీ మాస్టర్ తరుపు న్యాయవాదులు కోరారు.
అయితే జానీ మాస్టర్ కేసులో 5 రోజుల కిందట ఒక కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అది ఏంటంటే.. జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన బాధితురాలపై.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్‌గా పని చేయడం కోసం.. తన భర్తను ట్రాప్ చేసి.. ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసిందని ఆ ఫిర్యాదులో ఆరోపించింది. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో చూపించిందని.. తాను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని జానీ మాస్టర్ భార్య ఆరోపించారు.
అటు జానీ మాస్టర్‌ను పోలీసులు ఇంటరాగేట్ చేశారు. లాయర్ సమక్షంలో జానీ మాస్టర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. కేసులో కీలమైన టెక్నికల్ ఎవిడెన్స్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ బాధితురాలి నుంచి రెండుసార్లు స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసిన పోలీసులు.. ఇప్పుడు జానీ మాస్టర్ నుంచి మొత్తం సమాచారం రాబట్టడానికి ప్రయత్నించారు.
పోలీసుల విచారణలో జానీ మాస్టర్ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. బాధితురాలు ఇచ్చిన ఆధారాలను ముందుపెట్టి.. జానీ మాస్టర్‌ను పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం ఉంది. అయితే.. బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఒక షో సమయంలో బాధితురాలు తనకు తానే పరిచయం చేసుకున్నట్లు పోలీసులకు జానీ మాస్టర్ చెప్పినట్టు సమాచారం.
తనపై చేసిన ఆరోపణలు అబద్ధమైనవి అని జానీ మాస్టర్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. బాధితురాలు మైనర్‌గా ఉన్న సమయంలో తాను లైంగిక దాడి చేశానన్నది అబద్ధమని జానీ మాస్టర్ చెప్పాడు. కేవలం ఆ యువతి ట్యాలెంట్‌ను గుర్తించి.. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా తాను అవకాశం ఇచ్చినట్లు జానీ మాస్టర్ చెప్పాడు. తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలే హింసించేదని.. ఈ విషయంలో చాలాసార్లు బెదిరింపులకు దిగినట్లు పోలీసు విచారణలో వెల్లడించారు.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు