Connect with us

Latest Updates

అమెరికా కాంగ్రెస్‌కు తొలిసారి ట్రాన్స్‌జెండర్ ఎన్నిక

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్, డెమొక్రటిక్‌ అభ్యర్థులు డొనాల్డ్‌ ట్రంప్, కమలా హారిస్‌ మధ్య హోరాహోరీ పోరు నెలకుందని అన్ని సర్వేలు తేల్చి చెప్పినా.. విజయం మాత్రం ట్రంప్ వైపే మొగ్గుచూపుతున్నట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. స్వింగ్ స్టేట్లతోపాటు మెజార్టీ సీట్లను దక్కించుకుని.. డొనాల్డ్ ట్రంప్ విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్.. తన మద్దతుదారులతో కలిసి విజయోత్సవ సభను నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. మొత్తం 16. 5 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో దాదాపు సగం మంది ముందస్తు పోలింగ్ సౌకర్యం వినియోగించుకోవడం గమనార్హం. దానికి తగ్గట్లుగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఫలితాలు వస్తున్నాయి.

అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించి, రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్ ఎన్నికల్లో డెలవేర్‌లోని ఎట్‌ లార్జ్‌ హౌస్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి డెమొక్రటిక్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ సారా మెక్‌బ్రైడ్‌ (Sarah McBride) విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా ఆమె చరిత్రను సృష్టించారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి జాన్‌ వేలెన్‌ 3పై సారా మెక్‌బ్రైడ్ గెలుపొందారు. సారాకు 95శాతం ఓట్లు పోలవగా.. వేలెన్‌కు 57.9 శాతం ఓట్లు పోలయ్యాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా రావడంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులను ఉద్దేశించి.. ఆయన గెలుపు ప్రసంగం చేశారు. అమెరికా చరిత్రలో ఎప్పుడూ చూడని విజయాన్ని ఇప్పుడు మనం దక్కించుకున్నామని రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులతో ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికా ప్రజలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాను మళ్లీ గొప్పదేశంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. అమెరికా ఫస్ట్ అనేది తన నినాదం అని డొనాల్డ్ ట్రంప్ మరోసారి తేల్చి చెప్పారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు దాదాపు ఖాయమైంది. మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకు కేవలం 3 స్థానాలు దూరంలోనే ఉన్నారు. దీంతో రెండోసారి అధ్యక్ష పీఠం అధిరోహించాలన్న ఆయన కల నెరవేరినట్టయ్యింది. ఈ నేపత్యంలో ఆయన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది చరిత్రాత్మక విజయమని, అమెరికన్లకు ధన్యవాదాలు తెలిపారు.

హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో డెమొక్రటిక్‌ అభ్యర్థి నాన్సీ పెలోసీ (Nancy Pelosi) విజయం సాధించారు. కాలిఫోర్నియాలోని 12వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె.. అక్కడ నుంచి వరుసగా 20 సార్లు గెలిచిన మహిళగా నిలిచారు. మొదటిసారి ఆమె 1987లో గెలిచి.. అక్కడ నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అమెరికాలో ప్రతినిధుల సభకు స్పీకర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు.

Advertisement

భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఓటమి అంచున ఉన్నారు. ఈ నేపథ్యంలో కమలా హారిస్‌ తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. హోవర్డ్‌ యూనివర్సిటీ వాచ్‌ పార్టీలో ఆమె ప్రసంగించాల్సి ఉండగా.. ఆమె రేపు మాట్లాడతారని కమల ప్రచార బృంద సభ్యుడు సెడ్రిక్‌ రిచ్మండ్ వెల్లడించారు.

ఎన్నికలతో పాటు హౌస్ ఆఫ్ రిప్రంజటేటివ్స్‌కు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. భారత సంతతికి చెందిన సుహాస్‌ సుబ్రహ్మణ్యం ప్రతినిధుల సభ ఎన్నికల్లో విజయం సాధించారు.ఆయన వర్జీనియా 10వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి డెమొక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్ధి క్లాన్స్‌పై గెలుపొందారు. అలాగే, భారత సంతతికి చెందిన మరో నేత రాజా కృష్ణమూర్తి హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో విజయం సాధించారు. ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ఆయన డెమెక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.

Loading

Trending