Connect with us

Entertainment

ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్‌ కొత్త మూవీ ఎప్పుడంటే… ఫ్యాన్స్‌కి సూపర్‌ అప్‌డేట్‌ 

ప్రశాంత్నీల్ కేజీఎఫ్‌, సలార్సినిమాలతో పాన్ఇండియా స్థాయి దర్శకుడిగా మారిరు, ప్రశాంత్నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. వీరి కాంబో మూవీ గురించి రెండు మూడు సంవత్సరాలుగా మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి రాబోతుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్నవార్ 2″ సినిమాను ఏడాది చివరికి పూర్తిచేసి, వచ్చే ఏడాది వేసవికి ముందు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని సమాచారం. విషయంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. 

కేజీఎఫ్సినిమాకు ముందు వరకు ప్రశాంత్నీల్ గురించి పెద్దగా ఎవరికీ తెలిదు. కానీ సలార్ , కేజీఎఫ్తర్వాత ప్రశాంత్నీల్పాన్ ఇండియా స్థాయి దర్శకుడిగా మారిపోయారు. ముఖ్యంగా కేజీఎఫ్ 2 తో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో నటించేందుకు పాన్ఇండియా స్టార్హీరోలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్నీల్నుంచి వచ్చిన ప్రభాస్సలార్సైతం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం అంతా సలార్‌ 2 కోసం వెయిట్చేస్తున్నారు. షూటింగ్సగానికి పైగా పూర్తి అయిందని, త్వరలోనే ఒకటి రెండు షెడ్యూల్స్ లో సినిమాను ముగించేసి వచ్చే ఏడాదిలో సలార్ 2 ను సైతం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. 

సలార్ 2 కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అదే స్థాయిలో ఎన్టీఆర్తో ప్రశాంత్నీల్దర్శకత్వంలో రూపొందించబోతున్న సినిమా కోసం సైతం అదే స్థాయిలో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్నీల్ కొత్త మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చి 2 సంవత్సరాలు దాటింది. అయినా ఇప్పటి వరకు సినిమా కనీసం ప్రారంభం కాలేదు. ఒక్క అడుగు ముందుకు పడలేదు. సలార్ కోసం మొదట అనుకున్న దానికంటే ఎక్కువ సమయం ప్రశాంత్ నీల్ కేటాయించాల్సి వచ్చిందట. అందుకు తోడు, రెండు భాగాలుగా ప్లాన్ చేయడంతో, ఎన్టీఆర్తో సినిమాను చేయడానికి ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ తదుపరి అడుగు వేయలేకపోయారు. 

ఎన్టీఆర్దేవర సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దేవర సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కడంతో పాటు భారీ ఓపెనింగ్స్ దక్కాయి. లాంగ్రన్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేక పోయినా ఓవరాల్గా మాత్రం సినిమాకు పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు నమోదు అయ్యాయి. దేవర సినిమా పనులు ముగించుకున్న వెంటనే ఎన్టీఆర్వార్ 2″ కోసం సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో, కన్నడ సినీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం సలార్ 2 పై దృష్టి పెట్టిన ప్రశాంత్ నీల్, మరోవైపు ఎన్టీఆర్తో చేయబోయే సినిమాకి స్క్రిప్ట్ను తన టీమ్తో సిద్ధం చేయిస్తున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే, వచ్చే ఏడాది వేసవికి ముందే ఎన్టీఆర్ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా ప్రారంభం కావడానికి అవకాశం ఉంది. 

ఇటివల కాలంలో వచ్చిన సౌత్ఇండియన్ భారీ యాక్షన్ సినిమాలు పాన్ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు నమోదు చేస్తున్నాయి. కనుక ఎన్టీఆర్ నీల్ కొత్త మూవీ అంతకు మించి వసూళ్లు నమోదు చేయడం ఖాయం. కనుక వీరి ఇద్దారి కాంబో మూవీని రూ.500 కోట్ల బడ్జెట్తో నిర్మించాలని నిర్మాతలు భావిస్తున్నారట. హాలీవుడ్రేంజ్యాక్షన్సన్నివేశాలతో పాటు, ప్రతి విషయంలోనూ భారీతనం కొట్టొచ్చినట్లు కనిపించే విధంగా వీరి కాంబో మూవీ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ సినిమా గురించి ఫ్యాన్స్తో పాటు సినీ వర్గాల్లో, మీడియా సర్కిల్స్ లో తెగ చర్చ నడుస్తుంది. 

Advertisement

 

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending