Tech
Hyderabad Nexon EV Fire Case : టాటా మోటార్స్‌కు కోర్టు ఆదేశం

కారు ఓనర్‌కు రూ.16.95 లక్షలు చెల్లించాల్సిందే!- టాటా మోటార్స్‌కు కోర్టు ఆదేశం – Hyderabad Nexon EV Fire Case
Hyderabad Nexon EV Fire Case: టాటా నెక్సాన్ ఈవీలో మంటలు చెలరేగిన కేసులో వినియోగదారుల కోర్టు టాటా మోటార్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 16.95 లక్షలను కారు ఓనర్‌కు తిరిగి ఇవ్వాలని టాటా మోటార్స్‌ను కోర్టు ఆదేశించింది. అసలేం జరిగిందంటే?
- జోనాథన్ బ్రైనెర్డ్ అనే వ్యక్తి టాటా మోటార్స్‌కు చెందిన పాపులర్, అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్‌ను 2022లో కొనుగోలు చేశారు.
- అయితే అది కొన్న కొన్ని నెలలకే కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించి కారులో మంటలు చెలరేగాయి.
- ఆ సమయంలో తాను తన కారును గంటకు 38 కి.మీ తక్కువ వేగంతోనే డ్రైవింగ్ చేస్తున్నట్లు బ్రైనెర్డ్ తెలిపారు.
- 2023 జూన్ 1న జరిగిన ఈ ఘటనలో కారు కాలిపోయింది.
- వెంటనే కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు.
- మంటలు వేగంగా వ్యాపించడంతో కారు డోర్లు జామ్ అయ్యాయి.
- ఆ సమయంలో ఆయన సైడ్ డోర్ నుంచి బయటికి వచ్చి ప్రాణాలను కాపాడుకున్నారు.
- ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది.
- ఈ ఘటన తర్వాత బ్రెయినార్డ్ వినియోగదారుల కోర్టులో టాటా మోటార్స్‌పై కేసు వేశారు.
- సాంకేతిక సమస్యల కారణంగానే ఈ ఘటన జరిగిందని కారు యజమాని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Early Battery Discharge:
- కారు బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అవుతుందని బ్రైనర్డ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
- అదే సమయంలో కారును 18 శాతం ఛార్జ్ చేసిన తర్వాత కూడా అది స్టార్ట్ కాలేదన్నారు.
- ఆయన కారును సర్వీస్ సెంటర్లో చూపించగా మొదట కారు హెచ్‌వి బ్యాటరీ చెడిపోయిందని చెప్పినట్లు తెలిపారు.
- అయితే కొత్త బ్యాటరీని అమర్చకుండా పాత రీఫర్బిష్డ్ బ్యాటరీని కారులో అమర్చారని కారు ఓనర్ ఆరోపించారు.
రూ. 16.95 లక్షలు వాపసు ఇవ్వాలని ఆదేశం: ఈ కేసును విచారణ చేపట్టిన హైదరాబాద్‌లోని వినియోగదారుల కోర్టు కారు యజమానికి కారు పూర్తి ధరను అంటే రూ. 16.95 లక్షలను తిరిగి చెల్లించాలని టాటా మోటార్స్‌ను ఆదేశించింది.
Continue Reading
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు