Life Style
Radiation: రేడియేషన్ ఆరోగ్యానికి హానికరం, ప్రాణాంతకం..

ఈ రోజుల్లో చాలా మంది మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారు. మొబైల్ ఫోన్లు రేడియేషన్‌ను విడుదల చేస్తాయి కాబట్టి, ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. అందుకే, మీ ఫోన్ రేడియేషన్ స్థాయి ఎంత ఉందో ఇలా సులభంగా చెక్ చేసుకోవచ్చు
ఈ రోజుల్లో మొబైల్ వినియోగం చాలా పెరిగిపోయింది. చేతిలో మొబైల్ లేని వాళ్లు ఎవరూ కనిపించరు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సెల్‌ఫోన్ చూసేలా ఉంటున్నారు. చాటింగ్‌లు, మెసేజ్‌లు, కాల్స్ ఇలా రకరకాలుగా ఫోన్లు ఉపయోగిస్తూ కాలం గడుపుతున్నారు. కానీ, మొబైల్‌ను ఎక్కువగా వాడడం వల్ల వచ్చే ప్రమాదాలను చాలా మంది మర్చిపోతున్నారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్, పిల్లలకు ఆన్‌లైన్ తరగతులు వంటి కారణాలతో, మొబైల్ ఫోన్ రోజువారి అవసరంగా మారింది.
సెల్‌ఫోన్ టవర్ల నుంచి, మొబైళ్ల నుంచి వచ్చే రేడియేషన్ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే ప్రశ్న దశాబ్దాలుగా వినిపిస్తోంది. కానీ, దీన్ని గురించి క్లారిటీగా సమాధానాలు లేవు. సెల్‌ఫోన్ ముఖానికి దగ్గరగా ఉంచితే మెదడు మీద దుష్ప్రభావాలు ఉంటాయని, ప్యాంట్ జేబులో పెట్టుకుంటే వీర్యకణాలు తగ్గిపోతాయని, క్యాన్సర్ లాంటి ప్రమాదకర సమస్యలు వస్తాయని రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, రేడియేషన్ మానవ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందనేది అర్థమవుతోంది.
**మొబైల్ రేడియేషన్ అంటే ఏమిటి?**
సెల్‌ఫోన్ నుంచి వచ్చే తరంగాలు మన శరీరంలోని కణాలను వేడి చేస్తాయి, దీనిని రేడియేషన్ అంటారు. కణాలు వేడెక్కడం వల్ల వాటి పనితీరు, జన్యు నిర్మాణం దెబ్బతింటుంది. అయితే, ఫోన్ల రేడియేషన్ ప్రభుత్వం నిర్ణయించిన సురక్షిత పరిమితులలోనే ఉందని సంస్థలు చెబుతున్నాయి. ఈ విషయంలో పూర్తిగా స్పష్టత రాకపోయినా, కొంత జాగ్రత్తగా ఉండడం మంచిదే.
విశ్లేషకులు చెబుతున్న కొన్ని జాగ్రత్తలు:
– స్పీకర్ ఫోన్ ద్వారా మాట్లాడటం
– ఫోన్‌ని జేబులో కాకుండా పక్కన పెట్టుకోవడం
– రాత్రి పడుకునేటప్పుడు ఫోన్‌ను కొంత దూరంలో ఉంచుకోవడం.
మొబైల్ టవర్ల రేడియేషన్ మనుషులపై మాత్రమే కాదు, మొక్కలు, పక్షులపై కూడా ప్రభావం చూపుతుందని కొందరు పరిశోధకులు నమ్ముతున్నారు. అయస్కాంత శక్తిమీద ఆధారపడే పక్షులను సెల్‌టవర్లు గందరగోళానికి గురి చేస్తాయని, ఈ రేడియేషన్ పక్షుల గుడ్లను నాశనం చేస్తుందని నిపుణుల అభిప్రాయం. ఈ విషయాల్లో కూడా పూర్తి సమాచారం లేదు. అందువల్ల అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. రేడియేషన్ కారణంగా చర్మంపై దురద, పొడిబారడం, ఎరుపు, లేదా ముదురు రంగులోకి మారడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
**మొబైల్ రేడియేషన్‌ను ఎలా చెక్ చేసుకోవాలి?**
మీరు మీ మొబైల్ ఫోన్ రేడియేషన్‌ను చెక్ చేయాలనుకుంటే, మొబైల్‌లో *#07# డయల్ చేయాలి. ఈ నంబర్ డయల్ చేసిన వెంటనే, మీ మొబైల్ స్క్రీన్‌పై రేడియేషన్ గురించి సమాచారం కనిపిస్తుంది. ఇందులో రెండు రకాలుగా రేడియేషన్ స్థాయిని చూపిస్తారు:
1. తల – ఫోన్ మాట్లాడుతున్నప్పుడు తలపై ఉన్న రేడియేషన్ స్థాయి
2. శరీరం – ఫోన్‌ను వాడుతున్నప్పుడు లేదా జేబులో పెట్టుకున్నప్పుడు శరీరంపై ఉన్న రేడియేషన్ స్థాయి.
**మొబైల్ రేడియేషన్ ఎంత ఉండాలి?**
కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఏదైనా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా ఇతర స్మార్ట్ పరికరం రేడియేషన్ కిలోగ్రాముకు 1.6 వాట్‌లకు మించకూడదు. ఈ నియమం పరికరం మరియు శరీరం మధ్య 10 మిల్లీమీటర్ల దూరంలోనూ వర్తిస్తుంది. మీ పరికరం ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు లేదా జేబులో ఉంచుకున్నప్పుడు రేడియేషన్ ఈ పరిమితిని దాటితే, అది మీ ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తుంది.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు