Entertainment
‘కేజీఎఫ్ 3’ నుంచి క్రేజీ అప్‌డేట్… హీరో యశ్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు

కన్నడ సినిమా ఇండస్ట్రీ గురించి, కన్నడ సినిమాల గురించి చిన్న చూపు చూస్తున్న సమయంలో వచ్చిన కేజీఎఫ్ సంచల విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇంతకముందు కన్నడ సినిమాలంటే ఓ పాతిక కోట్ల వసూళ్లు చేస్తే గొప్ప విషయం అన్నట్టుగా పరిస్థితి ఉండేది. అలాంటిది కేజీఎఫ్ వందల కోట్ల వసూళ్లు నమోదు చేయడంతో ఇండస్ట్రీకి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. కేజీఎఫ్ కి ముందు కన్నడ సినిమా ఇండస్ట్రీ, కేజీఎఫ్ కి తర్వాత కన్నడ సినిమా ఇండస్ట్రీ అన్నట్లు పరిస్థితి మారింది. ఒక కన్నడ సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకు వెళ్లిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత వెంటనే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కేజీఎఫ్ రెండు పార్ట్‌లుగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా కేజీఎఫ్ 2 సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేయడం ద్వారా సరికొత్త రికార్డులను నెలకొల్పడం తో పాటు మొత్తం దేశం తమ వైపు తిరిగి చూసేలా ప్రశాంత్ నీల్, యశ్ చేశారు. యాక్షన్ సినిమాల అర్థం మార్చేసింది కేజీఎఫ్ అంటూ సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న కేజీఎఫ్ నుంచి మూడో పార్ట్ వస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు కేజీఎఫ్ 3 ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. హీరో యశ్ స్వయంగా మూడో పార్ట్ గురించి మాట్లాడటంతో ఫుల్ క్లారిటీ వచ్చినట్లయింది.
జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యశ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు టాక్సిక్, రామాయణం సినిమాల తర్వాత కేజీఎఫ్ 3 సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. ముందుగా ఒక టాక్సిక్ సినిమా వస్తుందని, ఆ తర్వాత రామాయణంకి సంబంధించి ఒక సినిమా ఉంటుందని యశ్ అంటున్నారు. ఆ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత కేజీఎఫ్ 3 సినిమా మొదలు అవుతుందని యశ్ ప్రకటించడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. యశ్ మాట్లాడిన మాటలను సోషల్ మీడియా ద్వారా అభిమానులు షేర్ చేస్తూ కేజీఎఫ్ 3 హ్యాష్ ట్యాగ్ ను ఓ రేంజ్లో ట్రెండ్ చేస్తున్నారు.
కేజీఎఫ్ 3 కి సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావడం చాల సంతోషంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ 2 ను చేసే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాదిలోనే NTR తో ఒక సినిమాను ఆయన చేయాల్సి ఉంది. NTR తో చేయనున్న సినిమా తర్వాత కేజీఎఫ్ 3 ని ప్రశాంత్ నీల్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని యశ్ మాటలను బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు