Entertainment
గోపీచంద్ నటించిన ‘విశ్వం’ ట్విట్టర్ రివ్యూ..

గోపీచంద్ హిట్టు కొట్టి చాలా కాలమే అవుతోంది. గోపీచంద్ లాంటి మాస్ హీరో, శ్రీను వైట్ల లాంటి కమర్షియల్ పల్స్ తెలిసిన డైరెక్టర్ ఎలాంటి సినిమా తీస్తాడో అని అంతా అనుకున్నారు. ఈ ఇద్దరూ అవుట్ డేటెడ్ అన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికీ ఓ మంచి సక్సెస్ కావాల్సిందే. ఇక బాక్సాఫీస్ వద్ద వీళ్లిద్దరు సందడి చేసి చాలా కాలమే అయింది. అందుకే ఈ ఇద్దరికీ ఇప్పుడు విశ్వం అనేది చాలా ముఖ్యమైన సినిమాగా మారింది. మరి ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 11న రిలీజ్ అయింది. ఈ మూవీ గురించి నెటిజన్లు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం.
సినిమా ఇప్పుడే చూశామని, అవుట్ డేటెడ్‌గా ఉందని, రొటీన్ సినిమానే తీశారని కొంత మంది ట్వీట్లు వేస్తున్నారు. ఇక మీడియా ట్విట్టర్ హ్యాండిల్స్ అయితే ఇది అవుట్ డేటెడ్ సినిమా అని ఏకి పారేస్తున్నారు. దారుణమైన రేటింగ్‌లు ఇస్తున్నాయి. కానీ నెటిజన్లు మాత్రం కాస్త పర్లేదు అని చెబుతున్నారు. వన్ టైం వాచబుల్ మూవీ అని అంటున్నారు.
విశ్వం డీసెంట్ వాచబుల్ సినిమా అవుతుంది.. ఓల్డ్ ఫార్మాట్.. ఈ స్టైల్లో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి.. ఈ ఫార్మాట్ మనకు అలవాటే.. సెకండాఫ్‌లో వచ్చే కామెడీ సీన్లు వర్కౌట్ అయ్యాయి.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎమోషనల్‌గా, చాలా లెంగ్తీగా సాగదీసినట్టు అనిపిస్తుంది. శ్రీను వైట్ల డైలాగ్స్, కామెడీ సీన్లు, కమెడియన్లు ఎలాగోలా లాక్కొచ్చేస్తారు అని చెబుతున్నారు.
అయితే ఈ సినిమా శ్రీను వైట్ల కమ్ బ్యాక్ అని చెప్పుకోలేం కానీ.. ఆగడు తరువాత కొంతవరకు చూడదగ్గ సినిమా మాత్రం అవుతుంది. ఇలా శ్రీను వైట్ల గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా చూడటం పూర్తయింది.. ఓవరాల్ ఎబో యావరేజ్ మూవీ.. ఒక్కసారి చూడొచ్చు.. కాకపోతే క్లైమాక్స్ ల్యాగ్, సాగదీసినట్టుగా అనిపిస్తుందని ఆడియన్స్ అంటున్నారు.
విశ్వం అవుట్ డేటెడ్.. సహనానికి పరీక్ష అని అంటున్నారు. గోపీచంద్, అలానే కొన్ని కామెడీ సీన్లు మాత్రమే ఈ సినిమాకి ప్లస్ అని ఇక స్టోరీ, నెరేషన్, ఊహకందేలా ఉండే కథనం.. వీక్ క్లైమాక్స్ ఇలా అన్నీ నెగెటివ్ పాయింట్లే అని ఆడియన్స్ చెబుతున్నారు. ట్విట్టర్ టాక్ ఇలా ఉన్నా కూడా.. ఇలాంటి రొటీన్ మాస్ చిత్రాలైనా కూడా కమర్షియల్‌గా అన్ని అంశాలతో వచ్చే చిత్రాలు బీ, సీ సెంటర్లలో బాగానే ఆడే అవకాశాలుంటాయి. ఇక పూర్తి రివ్యూ, రిపోర్ట్ రావాలంటే మాత్రం ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. కమర్షియల్‌గా శ్రీను వైట్ల, గోపీచంద్ విశ్వం నిలబడుతుందా? లేదా? ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు