Entertainment
ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్ – ఏమైందంటే? – Rajnikanth Hospitalized

Rajnikanth Hospitalized : సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఏంమైందంటే?
Rajnikanth Hospitalized : సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర కడుపు నొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పినట్లు సమాచారం.
మరోవైపు రజనీ కాంత్ గుండెకు సంబంధించి పలు వైద్య పరీక్షలను చేయించుకునేందుకు ఆస్పత్రిలో చేరినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మంగళవారం (అక్టోబర్ 1) ఈ పరీక్షలు చేస్తారట. అందుకే సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు తమిళ చిత్ర వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఏదేమైనా రజనీ కాంత్ ఆస్పత్రిలో చేరడంపై వైద్యుల నుంచి గానీ, రజనీ కాంత్ కుటుంబం నుంచి గానీ, ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఆందోళనలో ఫ్యాన్స్ – రజనీ కాంత్ హాస్పిటల్‌లో చేరారు అని తెలియడంతో వార్తలు పెద్ద ఎత్తున జోరుగా వస్తున్నాయి. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోనని ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Rajinikanth Vettaiayan Movie : కాగా, ప్రస్తుతం ఆయన వెట్టయాన్, కూలీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెట్టయాన్ అక్టోబర్ 10న విడుదల కానుంది. రీసెంట్‌గానే ఈ చిత్ర టీజర్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ఇందులో ఆయన పవర్‌ఫుల్ ఎన్‌కౌంటర్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. సినిమాలో విలన్‌గా రానా దగ్గుబాటి కనిపిస్తారని అంటున్నారు. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి.జ్ఞాన్వేల్ దర్శకత్వం వహించారు.
Rajinikanth Coolie Movie : ఇక ‘కూలి’ సినిమ విషయానికొస్తే యాక్షన్ థ్రిల్లర్‌గా ఇది ముస్తాబవుతోంది. నాగార్జున, శ్రుతిహాసన్, సౌబిన్ షాహిర్ సత్యరాజ్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీ కాంత్‌కు ఇది 171వ చిత్రం. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇది. కూలీ సినిమాలో నెంబర్ 1421గా రజనీకాంత్ దేవా పాత్ర పోషిస్తుండగా, చేస్తుండగా సైమన్‌గా నాగార్జున కనిపించనున్నారు.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు