Connect with us

Entertainment

రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి సెకండ్‌ సింగల్‌..

రామ్ చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా గేమ్‌ ఛేంజర్ అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో చరణ్‌ మూవీ అవ్వడంతో ప్రారంభం అయిన సమయంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. కానీ దర్శకుడు శంకర్‌ ఇటీవల వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల విడుదల అయిన ఇండియన్‌ 2 సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో గేమ్‌ ఛేంజర్ ఫలితం ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గేమ్‌ ఛేంజర్ సినిమా షూటింగ్‌ కి అనేక అవాంతరాలు ఎదురు అవుతూ చివరికి ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్‌ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం కన్ఫర్మ్‌ అంటూ మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చింది.

సినిమా డిసెంబర్ లో రాబోతున్న నేపథ్యంలో మెల్ల మెల్లగా ప్రమోషన్స్ సైతం షురూ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అందుకే సినిమా నుంచి సెకండ్‌ సింగల్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే విడుదల అయిన జరగండి పాటకు మిశ్రమ స్పందన దక్కింది. ఈసారి అంతకు మించి ఉండేలా మాస్‌ బీట్ సాంగ్ ను థమన్ తీసుకు వచ్చేందుకు రెడీ చేస్తున్నారట. సెకండ్‌ సింగ్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్న ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే విధంగా తాజాగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. సెకండ్‌ సింగ్ కి సంబంధించి మరో అప్‌డేట్‌ ను థమన్ ఇచ్చారు. రా మచా మచా అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటన చేశారు.

నేడు (సెప్టెంబర్ 25) సెకండ్‌ సింగిల్ గురించి అధికారికంగా ప్రకటన చేస్తామని చెప్పిన మేకర్స్‌ రా మచామచా అనే మాస్‌ సాంగ్ విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. కానీ ఎప్పుడు? ఎన్ని గంటలకు అని దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. నేడు ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటాయా, లేదంటే రేపు లేదా తర్వాత ఏమైనా అప్‌డేట్‌ ఇస్తారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. సోషల్‌ మీడియాలో గేమ్‌ ఛేంజర్‌ సెకండ్‌ సింగల్‌ కోసం ఫ్యాన్స్ చిత్ర యూనిట్‌ సభ్యులను ట్యాగ్‌ చేస్తూ పదే పదే పోస్ట్‌ లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో థమన్‌ నుంచి సెకండ్‌ సింగల్ అప్డేట్‌ వచ్చింది. అయితే ఆ ప్రకటనలో క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Loading

Trending