Entertainment
హిందీ బిగ్‌బాస్‌కి మహేష్ బాబు మరదలు.. ఎవరు ఆమె?

సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న హిందీ బిగ్ బాస్ కి నార్త్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రతీ సీజన్ అంతకు మించి అన్నట్లుగా రేటింగ్ దక్కించుకుంటూ సక్సెస్ అవుతుంది. అందుకే సల్మాన్ ఖాన్ పారితోషికం సీజన్ సీజన్ కి విపరీతంగా పెరుగుతోంది. కంటెస్టెంట్స్ విషయంలోనూ హిందీ బిగ్ బాస్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సౌత్ బిగ్ బాస్ షో ల్లో కంటెస్టెంట్స్ పెద్దగా క్రేజ్ లేని వారు ఉంటారు. కానీ హిందీ బిగ్ బాస్ లో మాత్రం ఎక్కువ శాతం మంచి ఫేమ్ ఉన్న వారిని తీసుకుంటూ ఉంటారు. హిందీ బిగ్ బాస్ సీజన్ 18 కంటెస్టెంట్స్ విషయం బాలీవుడ్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మహేష్ బాబు మరదలు
హిందీ బిగ్ బాస్ 18 లో తెలుగు లో హీరోయిన్స్ గా నటించిన సమీరా రెడ్డి, అనితలు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు.. శిల్ప శిరోద్కర్‌ను బిగ్ బాస్ నిర్వాహకులు ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ఈమె నమ్రత శిరోద్కర్ సోదరి అనే విషయం తెల్సిందే. మహేష్ బాబుతో పాటు, నమ్రత తో ఈమె ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటాయి. శిల్ప శిరోద్కర్ పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగులోనూ ఒక సినిమాలో హీరోయిన్ గా నటించినా, పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు.
నమత్ర మాదిరిగానే శిల్ప శిరోద్కర్ సైతం పెళ్లి తర్వాత సినిమా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. ఆమె పూర్తిగా ఫ్యామిలీకి సమయం కేటాయించింది. చాలా సంవత్సరాల తర్వాత శిల్ప శిరోద్కర్ నటనపై ఆసక్తితో సీరియల్ లో నటించింది. 2013 లో వచ్చిన ఆ సీరియల్ తో శిల్ప మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కానీ శిల్ప గత పదేళ్ల కాలంగా నటనకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మాత్రం రెగ్యులర్ గా ఫ్యామిలీ ఫోటోలను, వీడియోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తుంది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత బుల్లి తెరపై కనిపించేందుకు శిల్ప శిరోద్కర్ రెడీ అయ్యారు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు