Connect with us

Entertainment

ఆస్కార్స్‌కు లాపతా లేడీస్.. ఇండియా అధికారిక ఎంట్రీ ఇదే..

ఆస్కార్స్ వస్తున్నాయంటే చాలు.. ప్రతి ఏటా మన సినిమాకు ఏదైనా దక్కుతుందా అని ఆశగా ఎదురు చూస్తుంటాం. ఇక మన దేశం నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఏ సినిమాను పంపిస్తున్నారన్నదీ ఆసక్తి రేపే అంశమే. అయితే ఈసారి ఆ ఉత్కంఠకు తెరదించుతూ.. హిందీ మూవీ లాపతా లేడీస్ మూవీ అకాడెమీ అవార్డులకు ఇండియా అధికారిక ఎంట్రీ కానుంది.

97వ అకాడెమీ అవార్డులు వచ్చే ఏడాది జరగనున్న విషయం తెలిసిందే. వీటి కోసం ఇండియా నుంచి అధికారిక ఎంట్రీగా ఏ సినిమాను పంపించాలో నిర్ణయించడానికి చెన్నైలో సోమవారం (సెప్టెంబర్ 23) ది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు సమావేశమయ్యారు. ఇందులో లాపతా లేడీస్ మూవీని బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియా అధికారిక ఎంట్రీగా పంపాలని నిర్ణయించారు.

కిరణ్ రావ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నిర్మించాడు. ఈ మాజీ భార్యాభర్తల మూవీ బాక్సాఫీస్ దగ్గరే కాదు.. తర్వాత ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేసింది. ప్రతిభా రాణా, స్పర్ష్ శ్రీవాస్తవ, నితాన్షి గోయెల్ లాంటి వాళ్లు ఈ మూవీలో నటించారు.

గతేడాది మలయాళం మూవీ 2018ను అధికారిక ఎంట్రీగా పంపించినా.. అది 96వ అకాడెమీ అవార్డుల కార్యక్రమంలో షార్ట్ లిస్ట్ కాలేకపోయింది. అయితే అంతకుముందు ఏడాది మాత్రం మన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు లభించింది.

అంతేకాదు ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీకి కూడా ఆస్కార్ వచ్చింది. చివరిగా ఇండియా నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్స్ లో షార్ట్ లిస్ట్ అయిన మూవీగా 2001లో వచ్చిన లగాన్ నిలిచింది. అయితే చివరికి ఆ సినిమాను వెనక్కి నెట్టి నో మ్యాన్స్ ల్యాండ్ అనే మూవీ ఆ అవార్డు సొంతం చేసుకుంది.

Advertisement

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending