Connect with us

Entertainment

Mega Star చిరంజీవికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్..

మెగాస్టార్ చిరంజీవికి అవార్డులు కొత్తేం కాదు. నంది అవార్జుల నుంచి పద్మ విభూషణ్ వరకూ ఎన్నో అవార్డులను ఆయన అందుకున్నారు. అయితే ఇంకోసారి తెలుగువారు గర్వించేలా చేశారు చిరంజీవి. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి చిరంజీవి ఎక్కారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చిరుకి అందజేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అవార్డు ఎందుకంటే?
భారతీయ చలనచిత్ర రంగంలో ఫ్రొలిఫిక్ ఫిలిం స్టార్‌గా గిన్నిస్ రికార్డును అందుకున్నారు చిరంజీవి. 45 ఏళ్ల సినీ కెరీర్‌లో 156 చిత్రాల్లో చిరంజీవి నటించారు. ఇప్పటివరకూ 537 పాటలలో 24000 డ్యాన్స్ మూమెంట్స్ చేసినందుకు చిరంజీవికి ఈ అవార్డు దక్కింది. నిజానికి టాలీవుడ్‌లో డ్యాన్స్ అంటే మొదటిగా గుర్తొచ్చేదే చిరు పేరు. ఇక మెగాస్టార్‌కి గిన్నిస్ రికార్డు దక్కడంతో సోషల్ మీడియాలో మాములు హంగామా లేదు. చిరుకి గిన్నిస్ రికార్డు దక్కడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మెగాస్టార్‌కి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఈ ఏడాది మొదట్లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‍ను చిరంజీవి అందుకున్నారు.

Vishwambara (2025) - IMDb

ఇక కెరీర్ విషయానికొస్తే చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్‌లో ‘విశ్వంభర’ చిత్రం చేస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందంటూ డైరెక్టర్ వశిష్ట చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఖచ్చితంగా మెగాస్టార్ టాప్ 3 మూవీస్‌లో ఇది చోటు దక్కించుకుంటుందంటూ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో త్రిషతో పాటు మరో ఐదుగురు హీరోయిన్లు కూడా నటిస్తున్నారట.

 

Loading

Advertisement

Trending