Entertainment
BiggBoss 8 తెలుగు: సోనియా లవ్ స్టోరీ.. కాబోయే వాడు ఎవడు..?

బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పటివరకూ సరైన లవ్ స్టోరీ పట్టాలెక్కలేదు కానీ కావాల్సినంత ఎఫైర్లు మాత్రం సాగుతున్నాయి. ఓవైపు సోనియ-నిఖిల్, మరోవైపు పృథ్వీ-సోనియా.. ఇంకోవైపు పృథ్వీ-విష్ణుప్రియ.. ఈ మధ్యే సీత-నిఖిల్, యష్మీ-పృథ్వీ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకో ఎఫైర్ అలా తళుక్కుమంటుంది. అయితే సోనియా తనకి బయట ఓ లవర్ ఉన్నాడంటూ ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్‌లో తన లవ్ స్టోరీని రివీల్ చేసింది సోనియా.
అబ్బో ట్విస్ట్ అదిరింది
ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేరణతో ఏకాంతంగా మాట్లాడింది సోనియా. ఈ సందర్భంగా తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. “నేను ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదు కానీ రెండున్నరేళ్లుగా మేము కలిసి వర్క్ చేస్తున్నాం.. నేను స్టార్ట్ చేసిన ఎన్‌జీఓకి వెబ్‌సైట్ డిజైనింగ్ ఆయనే చేశారు.. అలానే దానికి ఆయన కూడా యూఎస్ నుంచి ఓ స్పాన్సర్.” అంటూ సోనియా చెప్పింది. మరి ఇందులో కాంప్లికేషన్ ఏముంది పెళ్లి చేసుకోవచ్చుగా అంటూ ప్రేరణ సలహా ఇచ్చింది. దీనికి “ఆయనకి వేరే ఒకరితో రిలేషన్ ఉంది.. కానీ ఇప్పుడు కాదు.. కానీ డిపెండెన్సీ ఉంది ఇప్పటికీ..” అంటూ సోనియా అంది .
“కానీ ఆయన నా లైఫ్‌లోకి వచ్చాకా చాలా ఛేంజస్ వచ్చాయ్.. ఫ్యామిలీ నుంచి నేను దూరంగా ఉండేదాన్ని.. నా గోల్స్‌కి ఇబ్బంది అవుతుందని.. కానీ తను వచ్చాకే అది మారింది” అంటూ సోనియా అంది. మరి ఏదో వేరే ఒకరితో అన్నావ్ కదా అదేంటి అంటూ ప్రేరణ అడిగింది. “అతను నా డెసిషన్ కోసం వెయిటింగ్ అంతే..” అంటూ ప్రేరణ చెవి దగ్గరికొచ్చి ఆయనకి డైవర్స్ అయింది అంటూ చిన్నగా గుసగుసలాడింది. దీనికి వెరీ నైస్ క్యూట్.. నువ్వు అర్థం చేసుకున్నది నాకు నచ్చింది అంటూ ప్రేరణ చెప్పింది.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు