Entertainment

కమెడియన్ సత్య ‘అమృతం’ రోజులు..

ఓ సక్సెస్ ఓ మనిషిని ఆకాశానికి ఎత్తేస్తుంది.. సక్సెస్‌లో ఉన్నప్పుడు అందరూ ఆ వ్యక్తి గురించే మాట్లాడుకుంటారు.. కష్ట పడటం, టాలెంట్ ఉండటం కాదు.. కాస్త టైం కలిసి రావాలి. అలా సత్యకు ఇప్పుడు టైం కలిసి వచ్చింది. కమెడియన్ సత్య టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. చాలా మంది దర్శకులు సత్య టైమింగ్‌ను వాడుకున్నారు. మత్తు వదలరా సినిమాలో కమెడియన్ సత్య యాక్టింగ్ చూసి అంతా ఫిదా అయ్యారు. ఇక రెండో పార్టులో సత్యని టాలీవుడ్ మొత్తం షేక్ అవుతోంది. చిరంజీవి, మహేష్ బాబు వంటి వారు కూడా సత్య గురించి మాట్లాడేస్తున్నారు.

మత్తు వదలరా 2 సినిమాకు అసలు హీరో సత్య అంటూ అందరూ పొగిడేస్తున్నారు. సక్సెస్ మీట్లో హీరో శ్రీ సింహా మాట్లాడుతూ.. అమృతం నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.. అమృతం సీరియల్‌లో సత్యతో పని చేశానని.. అప్పటి నుంచి పరిచయం ఉందని సింహా చెప్పుకొచ్చాడు. అయితే సత్య ఆ సీరియల్‌లో పని చేశాడని, యాక్ట చేశాడని చాలా మందికి తెలియదు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి వచ్చిన సత్య.. ఇప్పుడు టాప్ కమెడియన్‌గా మారిపోయాడు.

ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో సత్య పేరు ఎక్కువగా వైరల్ అవుతోంది. అమృతం సీరియల్‌లో సత్య నటించిన ఎపిసోడ్, వాటికి సంబంధించిన క్లిప్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అప్పటి నుంచి ఉన్నాడా? అప్పుడు కూడా భలే నటించాడే అని అంతా అనుకుంటున్నారు. సత్య చాలానే కష్టపడ్డాడని, ఇప్పుడు సక్సెస్‌ను అనుభవిస్తున్నాడని అంతా పొగిడేస్తున్నారు.

ప్రస్తుతం సత్య టైమింగ్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. కామెడీ మాత్రమే కాకుండా డ్యాన్స్ కూడా అదరగొట్టేశాడని అంటున్నారు. చూస్తుంటే బ్రహ్మానందం, సునీల్‌లకు రీప్లేస్‌లా సత్య ఉన్నాడనిపిస్తోంది. ఇకపై ఏ స్టార్ హీరో సినిమా అయినా సత్యకు సపరేట్ ట్రాక్ రాస్తారనిపిస్తోంది. రంగబలి లాంటి చిత్రాలను సత్య ఒక్కడే తన భుజాన మోసిన సంగతి తెలిసిందే. అలా సత్య ఎన్నెన్నో పాత్రలతో అందరినీ నవ్విస్తూ వస్తున్నాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version