Connect with us

Uncategorized

DSC పరీక్షలపై పునరాలోచన చేయాలి: YS షర్మిల

లోకేష్ గారూ.. అది తొందరపాటు నిర్ణయం.. వైఎస్ షర్మిల కామెంట్స్..! | apcc  chief ys Sharmila urges nara Lokesh to postpone mega dsc in wake of  objections - Telugu Oneindia

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్షల నిర్వహణపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక సూచనలు చేశారు. అభ్యర్థుల డిమాండ్లను ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం సరికాదని అభ్యర్థులు చెబుతున్నారని, 90 పాఠ్య పుస్తకాలను కేవలం 45 రోజుల్లో చదివి సిద్ధం కావడం సాధ్యం కాదని ఆమె అన్నారు. అభ్యర్థులకు సన్నద్ధత కోసం మరో 45 రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, పరీక్షల నిర్వహణలో నార్మలైజేషన్ పద్ధతిని అనుసరించకుండా, ‘ఒక జిల్లా – ఒక పేపర్’ విధానాన్ని అమలు చేయాలని షర్మిల సూచించారు. ఈ విధానం అభ్యర్థులకు మరింత సౌలభ్యంగా ఉంటుందని, పరీక్షల సమయంలో వారిపై ఒత్తిడి తగ్గుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఈ అంశాలను సీరియస్‌గా పరిశీలించి, అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending