Entertainment
‘ఠాగూర్’ సినిమాతో డాక్టర్ల బతుకు నాశనం… కానీ చిరంజీవి చాలా మార్చారు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ‘ఠాగూర్’ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా వచ్చి 20 ఏళ్లు దాటింది. సినిమాలోని చాలా సన్నివేశాలను అప్పుడు చూసిన ప్రేక్షకులు మర్చిపోయి ఉండచ్చు.. కానీ హాస్పిటల్ జరిగే సీన్ ను మాత్రం ఏ ఒక్కరు అంత తేలికగా మరచి పోయే అవకాశం లేదు. ప్రైవేట్ ఆసుపత్రి బిల్లుల టాపిక్ వచ్చిన ప్రతిసారి ఠాగూర్ సినిమాలోని ఆ సన్నివేశం గుర్తుకు రావాల్సిందే. చనిపోయిన డెడ్ బాడీకి చికిత్స చేస్తున్నట్లు నటించి బిల్లు గుంజడం ఆ సన్నివేశంలో చూపించారు. ఆ సన్నివేశం ఇప్పటి సినిమాలో ఉంటే కచ్చితంగా ఆసుపత్రి వర్గాల వారు తీవ్రంగా వ్యతిరేకించేవారు. కానీ అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ లేక పోవడం వల్ల వ్యతిరేకత అంతగా రాలేదు.
ఠాగూర్ సినిమాలోని ఆ సన్నివేశం వల్ల ఇప్పటికీ పలు ప్రైవేట్ ఆసుపత్రులు ఏదో ఒక మూలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ సీనియర్ డాక్టర్ గురువారెడ్డి అన్నారు. ఇటీవల ఆయన ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడుతూ ఠాగూర్ సినిమాలోని హాస్పిటల్ సన్నివేశం పై స్పందించారు. ఆ సన్నివేశంలో డాక్టర్లను హీనంగా చూపించారు, ప్రైవేట్ ఆసుపత్రులను మరీ నీచంగా చూపించారు. ఆ సన్నివేశం వల్ల డాక్టర్ల బతుకు నాశనం అయింది. ప్రతి ఒక్కరు ప్రైవేట్ ఆసుపత్రి అంటే అలాగే చూస్తున్నారు, ప్రతి డాక్టర్ని జనాలు అనుమానించడం మొదలు పెట్టారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఠాగూర్ సినిమాలోని ఆ సన్నివేశం మరి కొన్ని సంవత్సరాలు అయినా ప్రజల్లో అలాగే గుర్తుండి పోతుంది, వైద్యుల గురించి ప్రజల అభిప్రాయం మారే అవకాశం లేదు అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
డాక్టర్ గురువారెడ్డి పాడ్ కాస్ట్లో మాట్లాడుతూ… ఠాగూర్ సినిమాలోని ఆ సీన్ ను ఎవరు రాశారో తెలియదు, కానీ ఆ సీన్ వల్ల వైద్య వృత్తికి తీరని నష్టం జరిగింది. అత్యంత చెత్త సన్నివేశం అది. ఆ సినిమా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే డాక్టర్లు.. పేషంట్స్ ని ICU కి తీసుకు వెళ్తున్నారని అనుమానిస్తున్నారు. ఒకవేళ ఐసీయూలో ఉండి పేషెంట్ చనిపోతే అంతకు ముందే చనిపోయాడేమో, డబ్బు కోసం ట్రీట్మెంట్ చేశారని గొడవ చేస్తున్నారు. ఆ చావుకు తాము కారణం కాదని నిరూపించుకునేందుకు వైద్యులు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఠాగూర్ సినిమాలోని ఆ సన్నివేశం వల్ల ఎన్నో ప్రైవేట్ ఆసుపత్రుల్లో దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయన్నారు.
చిరంజీవి గారు తనకు బాగా తెలుసని, ఇద్దరం కలిసి కొన్ని సార్లు భోజనం కూడా చేశాం. ఒక సారి చిరంజీవి గారి దగ్గర ఈ ఠాగూర్ సినిమాలోని హాస్పిటల్ సన్నివేశం గురించి చర్చించడం జరిగింది. మొదట రాసుకున్న ఆస్పత్రి సన్నివేశం మరీ దారుణంగా ఉందట. చిరంజీవి గారు దాన్ని చాలా మార్పు చేశారట. లేకపోయుంటే ప్రైవేట్ ఆసుపత్రులు అంటేనే భయపడే విధంగా ఆ సన్నివేశం ఉండేదేమో అని అన్నారు. డాక్టర్ గురువారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగానే అత్యంత పవిత్రమైన డాక్టర్ వృత్తిని ఠాగూర్ సినిమాలో కొంచెం నీచంగా చూపించారు. ఒకరు, ఇద్దరు చేసే తప్పుడు పనిని మొత్తం వ్యవస్థకు అంట కడుతూ ఠాగూర్ సినిమాలో చిరంజీవి తో ఆ సీన్ చేయించడం అనేది చాల తప్పుడు నిర్ణయం అంటూ ఎంతో మంది డాక్టర్లు అంటూ ఉంటారు. ఇక ముందు అయినా రాబోయే రోజుల్లో ఇలాంటి సన్నివేశాలు రాకూడదని, డాక్టర్లు అంటే గౌరవం పెరిగే విధంగా సినిమాల్లో సన్నివేశాలు ఉండాలని అందరు డాక్టర్లు కోరుకుంటున్నారు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు