Entertainment
Devara Movie : రేపే ‘దేవర’ రిలీజ్.

Devara Movie : రేపే ‘దేవర’ రిలీజ్.. దేవర గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..
#ఎన్టీఆర్ ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
#RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమా కావడంతో ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో అంచనాలు బాగా ఉన్నాయి.
#రాజమౌళితో సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చే సినిమా కావడంతో హిట్ కొట్టి.. రాజమౌళి సినిమా తర్వాత వచ్చే ఫ్లాప్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు.
#ఎన్టీఆర్ ఇందులో డ్యూయల్ రోల్ లో నటించారు. గతంలో ఆంధ్రావాలా, అదుర్స్, శక్తి సినిమాల్లో డ్యూయల్ రోల్, జై లవకుశ సినిమాలో ట్రిపుల్ రోల్ చేసాడు.
#శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది.
#బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూడా ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో సైఫ్ విలన్ గా నటిస్తున్నాడు.
#దేవర పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.
#దేవర సినిమా రెండు పార్టులుగా రాబోతుంది.
#ఈ సినిమా చాలా శాతం సముద్రం పక్కనే షూట్ చేసారు. ఎక్కువగా అండమాన్, గోకర్ణ, గోవా, థాయ్ లాండ్ తో పాటు రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్స్ లో షూటింగ్ చేసారు.
#సినిమాలో సముద్రంలో యాక్షన్ సీక్వెన్స్ లు దాదాపు అరగంట పాటు ఉండనున్నాయి.
#సముద్రంలో యాక్షన్ సీక్వెన్స్ ల కోసం మూవీ టీమ్ దాదాపు నెలరోజులకు పైగా కష్టపడ్డారు.
#ఈ సినిమా కోసం సముద్రం సెట్ వేశారు.
#దేవర ట్రైలర్ లో చూపించిన షార్క్ సీన్ తీయడానికే ఒక రోజు పట్టింది.
#దేవర సినిమాకు చాలా తక్కువ ప్రమోషన్స్ చేయడం గమనార్హం.
#ఈ సినిమాకు ఎన్టీఆర్ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్ భాషల్లో డబ్బింగ్ చెప్పారు.
#దేవరలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ తో పాటు శృతి మరాఠీ, శ్రీకాంత్, నరైన్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, కలైరాసన్, మురళి శర్మ, అజయ్, హిమజ.. ఇలా పలువురు నటీనటులు నటిస్తున్నారు.
#ఇప్పటికే దేవర నుంచి మూడు సాంగ్స్, రెండు ట్రైలర్స్, గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి.
#అమెరికాలో అత్యధిక వేగంగా 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమాగా దేవర నిలిచింది.
#దేవర సినిమాను లాస్ ఏంజిల్స్ లోని బియాండ్ ఫెస్ట్ లో నేడు ప్రదర్శించనున్నారు.
#దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 కోట్ల థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. RRR కాకుండా ఎన్టీఆర్ కెరీర్లో ఇదే అత్యధికం.
#దేవర సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి టికెట్ రేట్లు పెంచుకోవడానికి, ఎక్స్ ట్రా షోలు వేసుకోడానికి ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులు లభించాయి.
#500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకొని దేవర సినిమా బరిలోకి దిగుతుంది.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు