Business
దూసుకెళ్తోన్న జువెలరీ స్టాక్.. లక్ష పెడితే రూ.4 లక్షలు! టాటా కంపెనీతో ఒప్పందం..

దూసుకెళ్తోన్న జువెలరీ స్టాక్.. లక్ష పెడితే రూ.4 లక్షలు! టాటా కంపెనీతో ఒప్పందం..
జువెలరీ సెక్టార్‌కు చెందిన ప్రముఖ కంపెనీ స్టాక్ ఒక ప్రకటనతో ఫోకస్‌లోకి వచ్చింది. వరుసగా అప్పర్ సర్క్యూట్లు కొట్టింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో 5 శాతం లాభపడింది. టాటా గ్రూప్ కంపెనీతో కీలక ఒప్పందం కుదిరినట్లు ప్రకటించడంతో, ఈ స్టాక్‌లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది.
స్మాల్ క్యాప్ కేటగిరి, జువెలరీ సెక్టార్ కంపెనీ అయిన ఆశాపురి గోల్డ్ ఆర్నమెంట్ లిమిటెడ్ (Ashapuri Gold Ornament Ltd) ఇటీవల కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటన తర్వాత, గత రెండు రోజుల్లో ఈ కంపెనీ స్టాక్ వరుసగా అప్పర్ సర్క్యూట్ కొట్టి, 5 శాతానికి పైగా లాభపడింది. దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన టాటా గ్రూప్ కంపెనీ టైటాన్ కంపెనీతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆశాపురి గోల్డ్ ఆర్నమెంట్స్ ప్రకటించిన క్రమంలో ఈ కంపెనీ స్టాక్ ఫోకస్‌లోకి వచ్చింది. మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ స్టాక్ రూ.10 లోపు ధర గల ఒక పెన్నీ స్టాక్.
కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం, బంగారు ఆభరణాల సరఫరా కోసం టాటా గ్రూప్‌కి చెందిన జువెలరీ సంస్థ టైటాన్ కంపెనీ మరియు ఆశాపురి గోల్డ్ ఆర్నమెంట్స్ మధ్య ముఖ్యమైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, ఆగస్టు 1, 2024 నుంచి జులై 31, 2026 వరకు టైటాన్ కంపెనీకి ఆశాపురి గోల్డ్ ఆర్నమెంట్స్ బంగారు ఆభరణాలు సరఫరా చేయాలి. ఈ కంపెనీ స్టాక్ ఔట్‌లుక్‌ను పరిశీలిస్తే, క్రితం రోజు ట్రేడింగ్‌లో ఈ కంపెనీ స్టాక్ ధర 5 శాతం పెరిగి, అప్పర్ సర్క్యూట్ రూ.8.97 వద్ద చేరింది. ఆ పండుగ రోజు కూడా 5 శాతం పెరిగింది. కానీ, నవంబర్ 14వ తేదీన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చూస్తే, లాభాలు తీసుకోవడం (లాభల స్వీకరణ) కనిపిస్తోంది. అమ్మకాల ఒత్తిడి ఉన్నప్పటికీ, కంపెనీ స్టాక్ లాభాల్లోనే కొనసాగుతోంది.
ఈ వార్త రాసే సమయానికి, 0.22 శాతం లాభంతో రూ.8.99 వద్ద కొనసాగుతోంది. ఈ స్టాక్ యొక్క 52 వారాల గరిష్ఠ ధర రూ.16.27, కనిష్ఠ ధర రూ.6.64. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.299.32 కోట్లు. స్టాక్ పీఈ రేషియో 25.01. ఈ స్టాక్ గత నెలలో 7 శాతానికి పైగా లాభాలు అందించింది. కానీ, గత ఏడాది కాలంలో కేవలం 1.35 శాతం మాత్రమే పెరిగింది. గత 5 ఏళ్ల కాలంలో 293 శాతం పెరిగింది. లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి రూ.4 లక్షలు అందించింది. ఆశాపురి గోల్డ్ ఆర్నమెంట్ లిమిటెడ్ కంపెనీ వివిధ రకాల బంగారు ఆభరణాల డిజైన్, తయారీ చేసి ఇతర సంస్థలకు సరఫరా చేస్తుంటుంది. ఈ సంస్థను 1997లో స్థాపించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రగా కార్యకలాపాలు సాగిస్తోంది.
-
Devotional10 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Devotional10 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Entertainment10 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Politics9 months ago
విజయ్‌పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు