Connect with us

Latest Updates

మంచి వార్త! మళ్లీ బంగారం ధరలు తగ్గాయి. నేడు హైదరాబాద్‌లో బంగారం ధర ఎంత ఉందంటే? 

బంగారం ధరలపై తాజా సమాచారం: మంచి వార్త! మళ్లీ బంగారం ధరలు తగ్గాయి. నేడు హైదరాబాద్లో బంగారం ధర ఎంత ఉందంటే? 

Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి గుడ్న్యూస్. దేశీయంగా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గుతున్నందున దేశంలో కూడా ధరలు తగ్గుతున్నాయి. దీపావళి సమయం లో బంగారం ధరలు తగ్గడం మంచి విషయం. అయితే, అక్టోబర్ 15 హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో ఇప్పుడు చూద్దాం.

దీపావళి సందర్భంలో బంగారం కొనుగోళ్లు చాలా ఎక్కువగా జరుగుతాయి. పండగ సీజన్ డిమాండ్కు తగినట్లుగా ఆభరణాలను సిద్ధం చేసుకున్నారు జువెలర్స్. కానీ, ఇటీవల బంగారం ధరలు పెరిగిపోతుండటంతో ఇది కొనుగోలు పై దుష్ప్రభావం చూపుతుందని వాళ్లు ఆందోళన చెందారు. ఇప్పుడు బంగారం ధరలు దిగివస్తున్నాయి, దీంతో జువెలర్స్, కొనుగోలుదారులకు ఊరట కలిగించే వార్తగా మారింది. మన దేశంలో దీపావళి పండుగకి బంగారం కొనుగోలు చాలా ఎక్కువగా జరుగుతుంది. బులియన్ మార్కెట్కు ఇదే అతిపెద్ద పండగగా చెబుతారు. ఇలాంటి తరుణంగా ధరలు దిగివస్తుండడం శుభపరిణామంగా చెప్పవచ్చు. క్రమంలో ఇవాళ అంటే అక్టోబర్ 15 తేదీన హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లలో బంగారం, వెండి రేట్లు ఎంతెంత తగ్గాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అంతర్జాతీయ మార్కెట్లో రికార్డ్ గరిష్ఠాల నుంచి పసిడి ధరలు దిగివస్తున్నాయి. క్రితం రోజు దాదాపు 10 డాలర్లు మేర పడిపోయిన ఔన్సు బంగారం ధర ఇవాళ అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతోంది.ప్రస్తుతం ఒక ఔన్సు బంగారం ధర 2648 డాలర్ల వద్ద ఉంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఒక ఔన్సుకు 31.19 డాలర్ల వద్ద ఉంది. మరోవైపు.. మన దేశ కరెన్సీ రూపాయి విలువ రోజు రోజుకు దిగజారుతోంది. డాలర్ విలువ పెరుగుతుండడంతో రూపాయి విలువ పడిపోతోంది. ప్రస్తుతం రూ.84.105 వద్ద అమ్ముడవుతోంది.

హైదరాబాద్లో బంగారం ధరలు..

Advertisement

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి.22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.50 తగ్గి రూ.71,150కి చేరింది. అలాగే, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1 తులానికి రూ.50 తగ్గి రూ.77,620కి పడిపోయింది.మరోవైపు.. ఢిల్లీ మార్కెట్లో రేట్లు చూసుకుంటే 22 క్యారెట్ల పుత్తడి ధర తులంపై రూ. 50 తగ్గి రూ. 71 వేల 300 వద్ద ట్రేడవుతోంది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ.50 తగ్గి రూ. 77 వేల 770 వద్దకు దిగివచ్చింది.

స్థిరంగా వెండి ధరలు

బంగారం ధర స్వల్పంగా తగ్గగా వెండి రేటు మాత్రం మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 1,03,000 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.97 వేల మార్క్ వద్ద ట్రేడుతోంది. ఢిల్లీ, హైదరాబాద్ మధ్య ధరల్లో తేడా ఉండేందుకు స్థానికంగా ఉండే పన్నులు కారణమవుతాయి. అలాగే కొనుగోలు చేసే ముందు స్థానికంగా ధరలు తెలుసుకోవడం మంచిది. 

Loading

Trending