Connect with us

Business

డీమ్యాట్ అకౌంట్‌పై ఎలాంటి ఛార్జీలు ఉంటాయి..స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఫుల్ లిస్ట్ ఇదే..

డీమ్యాట్ అకౌంట్‌పై ఎలాంటి ఛార్జీలు ఉంటాయి..స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఫుల్ లిస్ట్ ఇదే..

స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ అకౌంట్ అవసరం. డీమ్యాట్ అకౌంట్ తెరిస్తేనే ఈ పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. ఈ అకౌంట్లను చాలా బ్రోకరేజీ సంస్థలు అందిస్తున్నాయి. డీమ్యాట్ అకౌంట్లు తెరవడానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఈ ఖాతాలపై కొన్ని రుసుములు కూడా ఉంటాయి. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యువత.. పెద్ద మొత్తంలో లేదా తక్కువ కాలంలో డబ్బులు సంపాదించాలన్న ఆశ లేదా కోరికతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు కచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. డీమ్యాట్ ఖాతా తెరిచాక.. అందులోకి డబ్బులు యాడ్ చేసి.. స్టాక్ బ్రోకరేజీల నుంచి పెట్టుబడి పెట్టాలి. అవసరమైనప్పుడు అక్కడే విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. డీమ్యాట్ అకౌంట్ తెరవడం నుంచి స్టాక్ మార్కెట్ లావాదేవీల వరకు కొన్ని రుసుములు ఉంటాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డీమ్యాట్ అకౌంట్ తెరవడానికి బ్రోకరేజీ సంస్థకు, ఇంకా డిపాజిటరీ పార్టిసిపెంట్‌కు కొంత రుసుము చెల్లించాలి. బ్రోకరేజీ సంస్థలు ఆన్‌లైన్‌లో డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు నామమాత్రపు రుసుముల్ని వసూలు చేస్తాయి. కొన్ని సంస్థలు మొదటి ఏడాది ఉచిత సేవలు ఇస్తాయి. తర్వాత ఏడాది నుంచి ఛార్జీలు వసూలు చేస్తాయి.
డీమ్యాట్ ఖాతాను నిర్వహించేందుకు మెయింటెనెన్స్ పేరిట వార్షిక ఛార్జీల్ని వసూలు చేస్తాయి. ఏడాదికి ఈ రుసుములు రూ. 300 నుంచి 800 వరకు ఉంటుంది. ట్రాన్సాక్షన్ విలువను బట్టి ఈ యాన్యువల్ ఫీజులు మారొచ్చు.
అకౌంట్ హోల్డర్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌పైనా ఛార్జీలు ఉంటాయని చెప్పొచ్చు. ఇది బ్రోకరేజీని బట్టి మారుతుంటుంది. సెక్యూరిటీలు లేదా స్టాక్స్ కొన్నా, విక్రయించినా సర్వీస్ ఛార్జీలు పడతాయి. చాలా బ్రోకరేజీలు ప్రతి ట్రాన్సాక్షన్‌పైనా రూ. 20 చొప్పున వసూలు చేస్తున్నాయి.

డీమ్యాట్ అకౌంట్లో ఉన్న సెక్యూరిటీలన్నీ ఎలక్ట్రానిక్ రూపంలోనే ఉంటాయి. ఈ సెక్యూరిటీల భద్రతకు డిపాజిటరీ పార్టిసిపెంట్స్ నెలవారీగా నామమాత్రపు నెలవారీ రుసుమును వసూలు చేస్తాయి. రూ. 50 వేలు లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న చిన్న పెట్టుబడిదారుల అకౌంట్‌ను బేసిక్ సర్వీసెస్ డీమ్యాట్ అకౌంట్ అంటారు. ఈ ఖాతాపై వార్షిక నిర్వహణ ఛార్జీ ఉండదు.

Loading

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending