Connect with us

Latest Updates

బ్రెయిన్ డెడ్ అయినా వ్యక్తి.. ఇంతలోనే లేచి కూర్చున్నాడు

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానానికి కుటుంబసభ్యులు అంగీకరించడంతో అతడి గుండెను తొలగించేందుకు డాక్టర్లు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఓ అద్భుతం జరిగింది. ఆ వ్యక్తి కల్లు తెరవడంతో వైద్యులు విస్మయానికి గురయ్యారు. ఈ ఘటన అమెరికాలోని కెంటకీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కెంటకీ చెందిన 36 థామస్ టీజే హూవర్ II అక్టోబరు 2021లో డ్రగ్స్ ఓవర్‌డోస్ కారణంగా అస్వస్థతకు గురై స్థానిక బాప్టిస్ట్ హెల్త్ రిచ్‌మండ్ ఆసుపత్రిలో చేరాడు. మూడేళ్లుగా అక్కడ చికిత్స కొనసాగుతుండగా.. చివరకు అతడు ఇటీవల బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో అవయదానం చేయడానికి కుటుంబసభ్యులు అంగీకరించారు. అతడ్ని అక్టోబరు 17న ఆపరేషన్ థియేటర్‌ లోకి తీసుకెళ్లాక.. అక్కడ అతనికి కదలికలు వచ్చి, కళ్లు తెరిచాడు.

ఈ కేసును పర్యవేక్షించిన కెంటకీ ఆర్గాన్ డోనర్ అఫిలియేట్స్ (అంటే కోడా) మాజీ ఉద్యోగి అయినా నికోలెట్టా మార్టిన్ మాట్లాడుతూ… అతడు ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా అతను లేచాడని చెప్పారు. ‘శస్త్రచికిత్స సమయంలో స్పృహ‌లో ఉండటం.. మీ శరీరాన్ని ఎవరైనా కోసి అవయవాలను బయటకు తీయబోతున్నారని తెలుసుకోవడం అదో భయంకరమైన పీడకల’ అని మార్టిన్ వ్యాఖ్యానించారు. హూవర్‌కు ఇదే అనుభవం ఎదురయ్యిందని చెప్పారు.

మరో వైద్యుడు మాట్లాడుతూ.. ఐసీయూ నుంచి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్తున్నప్పుడు కూడా అతడు ప్రాణాలు తిరిగొస్తున్నాయనే సంకేతాలు కనిపించాయని అన్నారు. ‘అతను చుట్టూ చూశాడు.. మేము అతని కళ్ల నుంచి నీళ్లు రావడం చూశాం.. అతను స్పష్టంగా ఏడుస్తున్నాడు’ అని చెప్పారు. అయితే ప్రాణాలతో ఉన్న ఒక వ్యక్తి నుంచి బలవంతంగా అవయవాలను తొలగించేందుకు మీరు సిద్ధమయ్యారా? అనే ఆరోపణలను కోడా ఖండించింది. బతికున్న రోగుల నుంచి అవయవాలను సేకరించాలని కోడాలో ఎవరూ ఒత్తిడి చేయరని ఆ సంస్థ ఛైర్మన్ జులియా బెర్గన్ అన్నారు.

అటు, బాప్టిస్ట్ హెల్త్ రిచ్‌మండ్ హాస్పిటల్ కూడా రోగుల భద్రతకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది. అవయవదాతల అభిప్రాయాలను మేము గౌరవిస్తామని, రోగులు, కుటుంబాలతో తాము సన్నిహితంగా మలుచుకుంటామని స్పష్టం చేసింది. ఇక, బ్రెయిన్ డెడ్ నుంచి బయటపడి కోలుకుంటున్న హువర్.. ప్రస్తుతం తన సోదరి డోనా రోరెర్‌తో కలిసి ఉన్నాడు. అతడికి చట్టబద్ధమైన సంరక్షకుడిగా ఉన్నారు. ఆమె మాట్లాడుతూ.. తన సోదరుడు మూడేళ్లుగా కళ్లు తెరవలేదని ఆమె చెప్పింది. సంఘటన జరిగిన తర్వాత హూవర్ జ్ఞాపకశక్తి కోల్పోయి, నడవడం, మాట్లాడటం వంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. ఈ బాధాకరమైన అనుభవం అతని జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరోవైపు, ఈ సంఘటనపై అమెరికా హెల్త్ సర్వీసెస్ యంత్రాంగం దర్యాప్తు చేపట్టింది.

Loading

Advertisement

Trending